News February 10, 2025

కారంచేడు: స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

image

కారంచేడు మండల పరిధిలోని కేశవరపాడులో సోమవారం ఉదయం పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను ఎక్కించుకొని పూసపాడులోని పాఠశాలకు వెళ్తుండగా బస్సు వ్యవసాయ పనుల నిమిత్తం రోడ్డుపై ఉంచిన ఇనుప గొట్టంపై నుంచి వెళ్లే క్రమంలో అదుపుతప్పి రోడ్డు కిందకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News February 13, 2026

పిల్లల్లో మలబద్ధకానికి కారణాలివే..

image

పిల్లల్లో మలబద్ధకానికి ఎన్నో కారణాలుంటాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తగినంత ఫైబర్, నీరు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందంటున్నారు. IBS సమస్య ఉన్న చిన్నారుల్లో కూడా మలబద్ధకం కామన్‌గా కనిపిస్తుంది. ప్రయాణాలు, క్రమరహిత భోజన సమయాలు, జీవనశైలిలో తీవ్రమైన మార్పులు జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడతాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్లో అసౌకర్యాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు.

News February 13, 2026

సచ్చిదానంద సరస్వతి స్వామి మృతి పట్ల జగన్‌ సంతాపం

image

తుని తపోవనం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి శివైక్యం చెందడంపై మాజీ సీఎం జగన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామివారు జీవితాంతం ధర్మప్రచారం, వేద సంస్కృతి పరిరక్షణకు విశేష కృషి చేశారని కొనియాడారు. తపోవనం మఠాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్ది, భక్తులను సన్మార్గంలో నడిపించారని స్మరించుకున్నారు. వారి మరణం ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని, భక్తులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

News February 13, 2026

మెదక్: ఒక్క ఓటుతో గెలుపు

image

మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన కే.హరిత కేవలం ఒక ఓటుతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రావుపై విజయం సాధించారు. ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.