News November 19, 2025
కారంపూడి: రాచగావు అంటే ఏమిటో తెలుసా..?

కారంపూడిలో నేటి నుంచి పల్నాడు వీరుల ఉత్సవాలు రాచగావుతో ప్రారంభం అవుతున్నాయి. రాచగావు అంటే ఏమిటో తెలుసా..? రాచగావు అనేది వీరుల గుడి పూజారులు పోతురాజు ఆచారవంతునితో కలిసి పోతురాజుకు గావు (రక్షణతో కూడిన చూపు లేదా సేవ) చేస్తూ, ఉత్సవాలకు ప్రారంభం చేస్తారు. ఈ కార్యక్రమం పాటలు, వీర నృత్యాలతో జరుగుతుంది ఉత్సవాలలో వీరుల ఆరాధన, వారి ధైర్య గాథలకు భక్తి తెలియజేసే ముఖ్యమైన పురాణ సాంప్రదాయంగా ఉంది.
Similar News
News January 21, 2026
మద్దిరాల: రోడ్డు ప్రమాదంలో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని మద్దిరాల తహశీల్దార్ కార్యాలయ రికార్డు అసిస్టెంట్ రాజేష్(22) దుర్మరణం చెందారు. ఎస్‌ఐ వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి కుంటపల్లి నుంచి మద్దిరాల వస్తుండగా రాజేష్ బైక్‌ను వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 21, 2026
జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా వడ్డె వెంకట్ బాధ్యతల స్వీకరణ

అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా వడ్డె వెంకట్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తనకు, జిల్లా స్థాయి ఉన్నత పదవి కల్పించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని గ్రంథాలయాలను ఆధునీకరించి, విద్యార్థులకు, పాఠకులకు అందుబాటులో ఉండేలా అభివృద్ధి బాటలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
News January 21, 2026
మంచిర్యాలలో సర్పంచ్‌లకు శిక్షణ

ప్రతి ఒక్కరు తమ గ్రామాలను 100% అక్షరాస్యత సాధించేలా కృషి చేయాలని జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం అన్నారు. మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమంలో హాజరై ఉల్లాస్- అమ్మకు అక్షరమాల కార్యక్రమంపై సర్పంచులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో నిరక్షరాస్యులైన వయోజనులు ప్రతి ఒక్కరు చదువు నేర్చుకునేలా ప్రోత్సహించాలన్నారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


