News May 1, 2024

కార్మిక చట్టాలపై అవగాహన అవసరం: న్యాయమూర్తి తరణి

image

అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కార్మికుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని దుబ్బాక జూనియర్ సివిల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి వేముగంటి తరణి అన్నారు. బుధవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హబ్సిపూర్ శివారులో ఉన్న శ్రీ లలితా పరమేశ్వరి ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో పాల్గొన్నారు.

Similar News

News December 9, 2025

మెదక్: నేడు 5 వరకే మొదటి విడత ప్రచారం

image

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే జరగనుంది. మొదటి విడతలో హవేలి ఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గ్, పెద్దశంకరంపేట్, రేగోడ్ మండలాల్లో 160 పంచాయతీలో 16 సర్పంచ్ స్థానాలతోపాటు పలు వార్డు స్థానాలు ఏకగ్రీవమాయ్యాయి. 144 పంచాయతీలలో ఈనెల 11న పోలింగ్, సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు.

News December 9, 2025

MDK: ఉత్సాహంతో యువత గ్రామ పోరులోకి

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోరుకు యువత రంగంలోకి దిగింది. ప్రస్తుత తరుణంలో రాజకీయాలపై ఇష్టన్నీ, బాధ్యతను గుర్తించిన యువత ఈసారి జరగనున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషించునున్నారు. గ్రామ అభివృద్ధికి మేము సైతం అంటూ ముందుకు కదులుతున్నారు. ప్రశ్నించే గొప్ప తత్వాన్ని అలవర్చుకొని, ప్రజాసేవలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. డబ్బు, మద్యం లేని ఈ రాజకీయాల్లో రాణిస్తారో, లేదో!

News December 9, 2025

మెదక్ : సభలు, ర్యాలీలపై నిషేధం: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచారం 9 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పోలింగ్‌కు 44 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ అమలులోకి రానుంది. ఈ సమయంలో సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు నిషేధం. ఇతర ప్రాంతాల వారు పంచాయతీ పరిధిలో ఉండరాదు. ఉల్లంఘనలు గమనిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.