News November 16, 2025

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం: సీఐటీయూ

image

సిద్దిపేట కేంద్రంలోని కార్మిక వర్గ వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. సిద్దిపేటలో ఆదివారం నిర్వహించిన సీఐటీయూ 4వ జిల్లా మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.

Similar News

News January 17, 2026

నేడు బంగ్లాతో భారత్ ఢీ

image

U-19 వన్డే WCలో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన 14ఏళ్ల బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి ఉంది. అతనికి తోడు కెప్టెన్ ఆయుష్ మాత్రే, ఆరోన్ జార్జి, కుందు రాణిస్తే IND గెలిచే అవకాశాలు మెరుగవుతాయి. అటు తొలి మ్యాచ్‌లో 5 వికెట్లతో సత్తా చాటిన హెనిల్ పటేల్‌ను నిలువరించడం బంగ్లాకు కష్టమే. జింబాబ్వేలోని బులవాయో వేదికగా మ్యాచ్ 1pmకు మొదలుకానుంది.

News January 17, 2026

NRPT: మున్సిపల్ తుది ఓటర్ల జాబితా విడుదల

image

నారాయణపేట పురపాలక సంఘ పరిధిలో జరగనున్న రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలు నేపథ్యంలో తుది ఫొటో ఓటర్ల జాబితా, తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైదరాబాద్ ఆదేశాల మేరకు శుక్రవారం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు గాను మొత్తం 56 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఈ జాబితాలను ప్రజల పరిశీలనార్థం ప్రచురించారు.

News January 17, 2026

కర్నూలులో మహిళా దొంగల అరెస్ట్

image

కర్నూలు ఆర్టీసీ బస్టాండులో చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన రోజీ సుల్తానా, షేక్ రఫీకా అనే మహిళలను 4వ పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నవంబర్ 30న శారద అనే మహిళ కోవెలకుంట్ల బస్సు ఎక్కుతున్న సమయంలో ఆమె బ్యాగులోని 9 తులాల బంగారు నగలను దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి, అరెస్టు చేసినట్లు 4వ పట్టణ సీఐ విక్రమ సింహ తెలిపారు.