News January 18, 2026
కాలసర్ప దోష విముక్తికై నేడు ఇలా..

జాతకంలో రాహు-కేతువుల ప్రభావంతో ఏర్పడే కాలసర్ప దోషం వల్ల పనులు మధ్యలో ఆగిపోవడం, నిరాశ వంటివి ఎదురవుతాయి. చొల్లంగి అమావాస్య పర్వదినం దీనికి సరైన పరిష్కార సమయం. ఓ వెండి నాగుపాము ప్రతిమకు భక్తితో పూజ నిర్వహించి, దానిని ప్రవహించే నదిలో లేదా సముద్ర సంగమ జలాల్లో నిమజ్జనం చేయాలి. ఈ పవిత్ర రోజున ఇలా చేయడం వల్ల సర్వ దోషాలు తొలగి, జీవితంలో ఆటంకాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.
Similar News
News February 14, 2026
ఫిబ్రవరి 14: చరిత్రలో ఈరోజు

1898: స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత దిగవల్లి వేంకటశివరావు జననం
1921: ఆంధ్రప్రదేశ్ రెండో సీఎం దామోదరం సంజీవయ్య జననం
1952: మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ జననం
1983: తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణం(ఫొటోలో)
1984: నటుడు సి.హెచ్. నారాయణరావు మరణం
2019: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల వీరమరణం
☛ ప్రేమికుల దినోత్సవం
News February 14, 2026
విజయ్ ర్యాలీలో కార్యకర్త మృతి.. అన్నాడీఎంకే సెటైర్

టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎన్నికల ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. సేలంలో సభ జరుగుతున్న సమయంలో గుండెపోటుతో ఓ కార్యకర్త కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై అన్నాడీఎంకే నేత సత్యన్ వ్యంగ్యంగా స్పందించారు. టీవీకే ర్యాలీకి వెళ్తే శవపేటిక పట్టుకెళ్లాలని ట్వీట్ చేశారు. అంతకుముందు కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన సంగతి తెలిసిందే.