News August 13, 2025
కావలి నేతకు కీలక పదవి

రాష్ట్రంలో 32 నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన బీజేసీ సీనియర్ నేత RD విల్సన్‌కు కీలక పదవి లభించింది. ఆయనను తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్‌గా నియమించింది. ఆయనకు బీజేపీ నేతలు అభినందనలు తెలిపారు.
Similar News
News March 9, 2026
ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పిన నెల్లూరు కమిషనర్

నెల్లూరు నగరపాలక కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం సమస్యల పరిష్కార వేదిక జరిగింది. మేయర్ సుజాత అశోక్, కమిషనర్ వైఓ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులందరూ 300 చ.అ ఉచిత టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News March 9, 2026
కావలి: చదివింది 5th.. రూ.150 కోట్లకు కుచ్చుటోపి.!

చదివింది 5th. రియల్ ఎస్టేట్‌లో అంచెలంచెలుగా ఎదిగి HYDలో త్రిపుర కన్‌స్ట్రక్షన్ ప్రారంభించాడు. ప్రజల నుంచి ప్లాట్ల పేరుతో భారీగా వసూలు చేశాడు. ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసి దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేసినా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాడు కావలికి చెందిన పసుపులేటి సుధాకర్. ప్రజలు నిలదీయడంతో ఆయన బండారం బయటపడింది. అపార్ట్‌మెంట్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు.
News March 9, 2026
దుత్తలూరులో రక్షణ రంగ పరిశ్రమ

దుత్తలూరు పరిసర ప్రాంతంలో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశానికి కీలక వ్యవస్థగా ఉన్న రక్షణ రంగం ముడి సరుకు తయారీ ప్రాంతంగా దుత్తలూరు కేంద్రం కానున్నడంతో ఈ ప్రాంత నిరుద్యోగులకు మరింత ఆశలు చిగురించాయి. ప్రభుత్వం జీవో నెం.41ను సైతం విడుదల చేసింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 250 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.


