News November 17, 2025

కాశీ నుంచి గంగాజలాన్ని ఇంటికి తీసుకురావొచ్చా?

image

కాశీని మనం మోక్ష నగరంగా పరిగణిస్తాం. ఇక్కడ ఉండే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లలో నిత్యం దహన సంస్కారాలు జరుగుతుంటాయి. అక్కడ మోక్షం పొందిన ఆత్మల శక్తి గంగాజలంలో ఉంటుందని పండితులు అంటారు. ఆ శక్తిని ఇంటికి తీసుకురావడం అశుభంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొచ్చి, ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని నమ్మకం. అయితే హరిద్వార్, రిషికేశ్ వంటి ఇతర పవిత్ర నగరాల నుంచి గంగాజలం తేవడం శ్రేయస్కరం.

Similar News

News January 17, 2026

రక్తపాతానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణం: ఖమేనీ

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్రిమినల్ అని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫైరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ట్రంప్ హస్తం ఉందని ఆరోపించారు. ‘దేశంలో జరుగుతున్న విధ్వంసానికి, రక్తపాతానికి విదేశీయులే కారణం. అమెరికా, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న వారు భారీ నష్టాన్ని కలిగించి, వేలాది మందిని చంపారు. దేశాన్ని యుద్ధంలోకి లాగబోం. అలానే స్థానిక, అంతర్జాతీయ నేరస్థులను శిక్షించకుండా వదలబోం’ అని స్పష్టం చేశారు.

News January 17, 2026

RCB అభిమానులకు గుడ్‌‌న్యూస్

image

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచులు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ విషయాన్ని KA క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వ నిబంధనలు, షరతులకు లోబడి మ్యాచులు నిర్వహించుకోవాలని చెప్పినట్లు పేర్కొంది. కాగా గతేడాది ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. అప్పటి నుంచి స్టేడియంపై నిషేధం ఉంది.

News January 17, 2026

మద్యం అమ్మకాల్లో వృద్ధి

image

TG: 2025 DEC నాటికి మద్యం అమ్మకాలు, ఆస్తి రిజిస్ట్రేషన్ల ఆదాయంలో రాష్ట్రం గణనీయ వృద్ధిని సాధించింది. ఆస్తి పన్ను వార్షిక లక్ష్యం ₹19,087CR కాగా 59.22% (₹11,304CR) సాధించినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. 2024లో ఇది కేవలం 41.28% మాత్రమే. ఎక్సైజ్ ఆదాయం ₹27,263 CR లక్ష్యంలో 63.38% (₹17,507CR) సాధించింది. 2024లో ఇది 54.96%. ఇక అమ్మకపు పన్ను 2024లో DEC నాటికి 71% సాధించగా ఈసారి అది 67.07%కి తగ్గింది.