News March 29, 2024
కాసిపేట: అల్యూమినియం దొంగతనం.. ఫిర్యాదు
కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ శివారులోని ట్రాన్స్ఫార్మర్ నుంచి 23 కిలోల అల్యూమినియం దొంగతనానికి గురైందని ఏఈ స్వర్ణలత ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. ట్రాన్స్ఫార్మర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు 23 కిలోల అల్యూమినియం అపహరించారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Similar News
News January 25, 2025
గుడిహత్నూర్: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త సూసైడ్
వ్యక్తి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న ఘటన గుడిహత్నూర్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన షేక్ ఆఫీస్ (40) తరచుగా భార్యతో గొడవలు పడేవాడు. శుక్రవారం వారి మధ్య గొడవ జరగడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీతో మనస్తాపం చెందిన ఆఫీస్ శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందాడు.
News January 25, 2025
నార్నూర్: 7 రోజుల్లో ముగ్గురు మృతి
నార్నూర్ మండలంలో గత ఏడు రోజుల్లో ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. మండల కేంద్రానికి చెందిన జాదవ్ విశ్వరక్షక్ ఈ నెల 17న శుక్రవారం ఉట్నూరులో పురుగు మందు తాగి మరణించారు. 23న గురువారం భీంపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ బన్నీ అనే విద్యార్థి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖోఖో పోటీలు ఆడుతూ గుండెపోటుతో మృతిచెందారు. శుక్రవారం మాన్కపూర్ గ్రామానికి చెందిన చంద్రకాంత్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
News January 25, 2025
27 నుంచి ప్రతి మండలంలో ప్రజావాణి: ADB కలెక్టర్
ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా ప్రజావాణి కార్యక్రమం ఇక నుంచి ప్రతి రోజూ మండలంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఈ నెల 27 నుంచి కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. రెవెన్యూ, ఉపాధి హామీ, పెన్షన్, రేషన్ కార్డులు, తాగునీరు, విద్యుత్ సమస్యలపై దరఖాస్తులు ఆయా మండలాల్లో కార్యాలయ అర్జీలను సమర్పించాలన్నారు.