News December 2, 2025

కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. చెన్నై సమీపంలో ఉన్న వాయుగుండం నెమ్మదిగా కదులుతుందని పేర్కొన్నారు. సాయంత్రం తీరాన్ని తాకే అవకాశం ఉందని, ఆ సమయంలోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. గత రెండు రోజులుగా ఈ జిల్లాల్లో వానలు పడుతున్న సంగతి తెలిసిందే.

Similar News

News February 9, 2026

చంద్రుడిపై సిటీ నిర్మాణం.. పదేళ్లలోనే పూర్తి: మస్క్

image

చంద్రుడిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మించడంపై SpaceX దృష్టిసారించిందని, ఇది 10ఏళ్లలోనే పూర్తవుతుందని ఎలాన్ మస్క్ తెలిపారు. అంగారకుడిపై దీనికి 20+Y పడుతుందన్నారు. ‘గ్రహాలు 26 నెలలకొసారి సమాంతరంగా చేరినప్పుడే 6 నెలల్లో మార్స్‌కు ప్రయాణించగలం. 10 రోజులకోసారి 2 రోజుల్లో చంద్రుడిపైకి వెళ్లొచ్చు కాబట్టి అక్కడ సిటీని వేగంగా పూర్తిచేయగలం. భవిష్యత్తు నాగరికతను కాపాడటమే మా లక్ష్యం’ అని Xలో పేర్కొన్నారు.

News February 9, 2026

గొర్రెల మందలో విత్తన పొట్టేలు ప్రాముఖ్యత

image

గొర్రెల మంద పెరగాలన్నా, నాణ్యమైన పిల్ల రావాలన్నా, మందలో ప్రతీ 20-25 గొర్రెలకు మంచి విత్తన పొట్టేలును ఎంపిక చేసుకోవాలి. అది బలంగా, ఎత్తుగా ఉండాలి. చాలా మంది రైతులు తమ మందలో పుట్టిన పిల్లను విత్తనం కోసం ఎంపిక చేసుకుంటారు. దీని వల్ల నాణ్యమైన పిల్ల పుట్టకపోగా, బలహీనంగా, అంగవైకల్యంతో, తక్కువ బరువు, సంతానోత్పత్తికి పనికిరాకుండా ఉంటాయి. అందుకే వేరే మంద నుంచి నాణ్యమైన పొట్టేలును ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

News February 9, 2026

డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే లోన్

image

AP: డ్వాక్రా సంఘాల కోసం ఏర్పాటు చేసిన ‘స్త్రీ నిధి’ పథకాన్ని డిజిటల్ విధానంలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైక్రో ఫైనాన్స్ బారిన పడకుండా దరఖాస్తు చేసుకున్న మహిళలకు 48 గంటల్లో లోన్ అందేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. అలాగే ఒక్కో స్వయం సహాయక సంఘానికి ఇస్తున్న రూ.5 లక్షల లోన్‌ను రూ.8 లక్షలకు పెంచింది.