News September 11, 2025

కాసేపట్లో జైలులో సరెండర్ కానున్న MP మిథున్ రెడ్డి

image

MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాసేపట్లో రాజమండ్రి జైలులో సరెండర్ కానున్నారు. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఆయనకు ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియనుండటంతో నేటి సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ కానున్నారు. ఇప్పటికే ఆయన విజయావాడకు చేరుకుని రాజమండ్రికి బయలుదేరారు.

Similar News

News December 10, 2025

జగిత్యాల: 1064 టోల్‌ఫ్రీ నెంబర్‌తో అవినీతికి అడ్డుకట్ట

image

అవినీతి నిర్మూలనకు ప్రజలు 1064 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి అవినీతి నిరోధక వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగులు నిబద్ధతతో పని చేసి అవినీతి నిర్మూలనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. లంచం అడిగితే 1064కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.

News December 10, 2025

3రోజుల పాటు AP ఛాంబర్స్ బిజినెస్ EXPO

image

యువత, మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలనే లక్ష్యంతో బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు AP ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. VJAలో ఈ నెల 12,13,14 తేదీల్లో జరిగే EXPOలో మంత్రులు పాల్గొంటారన్నారు. MSME, టూరిజం, టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మహిళ సాధికారతపై సెమినార్లు ఉంటాయని చెప్పారు. 160స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఎంట్రీ ఉచితమన్నారు.

News December 10, 2025

ADB: 166 సర్పంచ్, 1392 వార్డ్ స్థానాలకు ఎన్నికలు

image

ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 6 మండలాల్లో 166 సర్పంచ్, 1392 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పోలింగ్ సామగ్రి పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సరిపడినంత సిబ్బందిని నియమించడంతో పాటు వారికి శిక్షణ పూర్తి చేశామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని వివరించారు.