News November 20, 2025

కాసేపట్లో GHMC స్టాండింగ్ కమిటీ మీటింగ్..!

image

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన కాసేపట్లో స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. నగర పరిపాలనకు కీలకమైన ఈ సమావేశంలో సుమారు 20 ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. రోడ్లు, పారిశుద్ధ్య చర్యలు, డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక వసతుల అభివృద్ధి, పౌర సేవల మెరుగుదల వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Similar News

News January 20, 2026

ఫోన్‌పే IPOకు SEBI ఓకే

image

ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే IPOకు SEBI గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నియంత్రణ సంస్థ సూచనలతో అప్‌డేట్ చేసిన DHRPని ఫోన్‌పే త్వరలోనే సబ్మిట్ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ రూపంలో IPOకు వస్తుండటంతో కంపెనీకి పబ్లిక్ ఇష్యూ ద్వారా కొత్తగా నిధులు సమకూరే అవకాశాలు లేవు. ఫ్రెష్ ఇష్యూలు కూడా ఉండవని తెలుస్తోంది. IPO విలువ రూ.12వేల కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుత UPI లావాదేవీల్లో 45% ఫోన్‌పే యాప్‌ ద్వారానే జరుగుతున్నాయి.

News January 20, 2026

MHBD: గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలి: జడ్పీ సీఈఓ

image

ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సర్పంచులు గ్రామాల్లో సుపరిపాలన అందించాలని జడ్పీ సీఈఓ పురుషోత్తం పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌లో నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమం రెండో రోజు నిర్వహించారు. పంచాయతీరాజ్ చట్టం, విధులపై అవగాహన పెంచుకుని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. డీపీఓ హరిప్రసాద్, డీఎల్పీఓ పుల్లారావు, ఎంపీడీవోలు, ఎంపీవోలు ఉన్నారు.

News January 20, 2026

వీధికుక్కల కేసు.. మేనకా గాంధీపై సుప్రీం ఫైర్

image

వీధికుక్కల అంశంపై తమ కామెంట్స్‌ను కించపరచడం కోర్టు ధిక్కరణేనని BJP నేత మేనకా గాంధీపై SC మండిపడింది. ‘మీరు మా వ్యాఖ్యలపై మాట్లాడుతున్నారు. మీ క్లయింట్ ఎలాంటి కామెంట్స్ చేశారో అడిగారా? ఆమె బాడీ లాంగ్వేజ్ గమనించారా?’ అని మేనకా తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. దీంతో తాను గతంలో కసబ్ తరఫునా వాదించానని ఆయన గుర్తుచేశారు. కానీ కసబ్ కోర్టు ధిక్కరణకు పాల్పడలేదంటూ తదుపరి విచారణను JAN 28కి వాయిదా వేసింది.