News February 7, 2025

కుంభాభిషేకం ముగింపు కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు రంగ రంగ వైభవంగా ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కాళేశ్వర దేవస్థానంలో శుక్రవారం జిల్లా కలెక్టర్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పర్యటించారు. ఈనెల 9న మహా కుంభాభిషేకం ముగింపు కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని రద్దీకి తగినట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Similar News

News February 16, 2026

ఫేక్ లింకులపై క్లిక్ చేయొద్దు: బాపట్ల ఎస్పీ

image

ఫేక్ లింకుల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరించారు. క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్, బ్యాంక్ KYC అప్‌డేట్, తక్కువ వడ్డీ రుణాల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించారు. OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైనట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయాలన్నారు.

News February 16, 2026

పాపన్నపేట: ‘బండ్ల ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉంది’

image

పాపన్నపేట మండలంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గమాత అమ్మవారికి సోమవారం సాయంత్రం బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొని బండ్ల ఊరేగింపు నిర్వహించిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి బండ్ల ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

News February 16, 2026

అంతర్జాతీయ కార్యక్రమాల భద్రతపై సీపీ సమీక్ష

image

విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల భద్రతా ఏర్పాట్లపై సీపీ డా.శంఖబ్రత బాగ్చి ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. విదేశీ ప్రతినిధులు, VVIPల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై కీలక ఆదేశాలిచ్చారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు, డ్రోన్ నిఘా, CCTV మానిటరింగ్‌తో పాటు చిన్నారుల రక్షణకు RFID సాంకేతికతను వినియోగించాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు.