News November 6, 2025

కుమ్మెరలో అత్యధిక వర్షపాతం నమోదు

image

NGKL జిల్లాలో గడిచిన 24 గంటలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర 42.5 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. పాలెం 33.8, నాగర్‌కర్నూల్ 26.3, లింగాల 22.5, కల్వకుర్తి 15.5, బిజినేపల్లి 15.0, పెద్దముద్దునూరు 10.5, ఎల్లికల్ 5.3, వటవర్లపల్లి 5.0, వెల్దండ 2.0, ఊర్కొండ 1.3, సిర్సనగండ్ల 0.8, అత్యల్పంగా తోటపల్లిలో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News January 22, 2026

రేపు భక్తులకు అమ్మవారి జోగులాంబ నిజరూప దర్శనం

image

వసంత పంచమి పురస్కరించుకొని రేపు అలంపూర్ పట్టణంలోని ఐదో శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించనున్నారు. అలంపూర్ పట్టణంలో మహిళలు రేపు పెద్ద సంఖ్యలో పంచామృత కలశాలతో పట్టణంలో ఊరేగింపుగా వచ్చి శ్రీ జోగులాంబ అమ్మవారికి కలశాభిషేకం చేసి దర్శించుకొనున్నారు. ప్రతి సంవత్సరం వసంత పంచమిన జరిగే ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.

News January 22, 2026

40వేల మందితో సమగ్ర భూసర్వే చేయించాం: జగన్

image

AP: 40వేల మంది సిబ్బందితో భూముల రీసర్వే సమగ్రంగా చేయించామని YS జగన్ పేర్కొన్నారు. ‘సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించాం. ఈస్థాయిలో రైతులకు, ప్రజలకు మేలు చేసిన GOVT ఏదీలేదు. ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా డిజిటల్ రికార్డులు సిద్ధం చేశాం’ అని వివరించారు. ఏదో రాయిని పెట్టేసి వదిలేయకుండా అధికారిక సరిహద్దులు చూపేలా సమగ్ర చర్యలు తీసుకున్నామన్నారు.

News January 22, 2026

భద్రాద్రి జిల్లాలో 37 ఇంటర్ పరీక్ష కేంద్రాలు

image

కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు 37 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 9,278 మంది, ద్వితీయ సంవత్సరంలో 9,407 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. పరీక్షల పర్యవేక్షణకు 550 మంది ఇన్విజిలేటర్లు, 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు వెల్లడించారు.