News April 10, 2025
కువైట్‌లో కాకినాడ జిల్లా మహిళపై యాసిడ్ దాడి

భర్త మృతితో కుటుంబ పోషణ కోసం కువైట్ వెళ్లిన మహిళ యాసిడ్ దాడికి గురై అక్కడ చిక్కుకుపోయింది. యూ.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త చనిపోవడంతో కువైట్‌లో పనికి వెళ్లింది. కడపకు చెందిన ఓ ఏజెంట్ ఆమెను 2నెలల క్రితం పంపించాడు.150 దీనార్ల జీతమని చెప్పి 100 దీనార్లే ఇవ్వడంతో ఆమె ప్రశ్నించింది. దీంతో యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ విషయం ఆమె కుటుంబీకులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News January 18, 2026
తెలుగు జాతి ఖ్యాతి ఎన్టీఆర్: పురందీశ్వరి

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి ఆదివారం ఆయనకు ఘన నివాళులర్పించారు. ఒక ఉత్తమ నాయకుడు జన్మిస్తే ఆ వంశానికే కాక మొత్తం జాతికే గుర్తింపు వస్తుందని కొనియాడారు. ఉన్నత విలువలు కలిగిన ఎన్టీఆర్ వల్ల తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్త ఖ్యాతి లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేస్తూ తన తండ్రి జ్ఞాపకాలను పురందీశ్వరి స్మరించుకున్నారు.
News January 18, 2026
వేగం కన్నా ప్రాణం మిన్న.. వాహనదారులకు ఎస్పీ హితవు

సంక్రాంతి ముగించుకుని గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు రహదారి నియమాలు పాటించాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ సూచించారు. రోడ్లపై రద్దీ దృష్ట్యా వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, వేగంగా వెళ్లడం కంటే క్షేమంగా చేరడం ముఖ్యమని హితవు పలికారు. వీలైనంత వరకు రాత్రి ప్రయాణాలు మానుకోవాలని కోరారు. అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు నివారించాలని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో కోరారు.
News January 17, 2026
ఏపీ ఎన్జీవో హోమ్ అభివృద్ధికి చర్యలు: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

రాజమండ్రి ఏపీ ఎన్జీవో హోమ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘ స్వరూప్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఎన్జీవో సంఘ ప్రతినిధులు కలెక్టరేట్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భవనాన్ని ఆధునీకరించాలని కోరారు. ఈ సందర్భంగా సంఘం డైరీ, క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు.


