News September 12, 2025

కూకట్‌పల్లిలో వ్యభిచారం.. ఐదుగురి అరెస్ట్

image

కూకట్‌పల్లిలోని 15వ ఫేజ్‌లో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార కేంద్రాన్ని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిర్వాహకురాలితో పాటు నలుగురు యువతులు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News December 16, 2025

సింహాచలం కొండపై HT లైన్‌లకు గ్రీన్ సిగ్నల్

image

సింహాచలం కొండపై నుంచి NSEL వరకు HT విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఏపీ ట్రాన్స్‌కోకు అనుమతినిచ్చింది. ఈప్రాజెక్టులో భాగంగా దేవస్థాన భూముల్లో 27 టవర్ల లైన్లు వేయాల్సి ఉంది. ఇందుకుగాను వాడుకున్న స్థలానికి పరిహారంగా ట్రాన్స్‌కో ద్వారా దేవస్థానానికి రూ.15కోట్లు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈపనులను వెంటనే పరిశీలించి, అనుమతులు మంజూరు చేయాలని ఆలయ ఈవోను ప్రభుత్వం ఆదేశించింది.

News December 16, 2025

3వ విడత.. 1100 మంది సిబ్బందితో బందోబస్తు

image

3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు CP సాయి చైతన్య వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 1100 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

News December 16, 2025

కర్నూలు: నడిరోడ్డుపై పసికందు.!

image

కర్నూలులో అమ్మ తనానికే మచ్చ తెచ్చే అవానవీయ ఘటన జరిగింది. నవ మాసాలు మోసి కన్న నెలలు నిండని పాపను రోడ్డుపై పడేసిందో కసాయి తల్లి. మంగళవారం ఉదయం నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ పేట రోడ్డుపై పాపను గుర్తించి సామాజిక కార్యకర్త అక్కున చేర్చుకున్నాడు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.