News August 21, 2025

కూకట్‌పల్లి: ఎవరు చంపారో.. ఎందుకు చంపారో!

image

కూకట్‌పల్లిలో సహస్రిని (11) హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. హత్యకు సంబంధించి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివిధ బృందాలుగా ఏర్పడి క్షుణ్ణంగా నిందితుడి కోసం జల్లెడ పడుతున్నారు. భవనంలో ఉంటున్నవారిని, స్థానికులను, బంధువులను ప్రశ్నించారు. నిందితులకు సంబంధించి పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వటం లేదు. దర్యాప్తు వేగంగా జరుగుతోందని, వివరాలు అనంతరం వెల్లడిస్తామని మాత్రమే చెబుతున్నారు.

Similar News

News January 20, 2026

రియల్ ఎస్టేట్ జాతకాన్ని మార్చేయబోతున్న గోదావరి!

image

‘ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ సిరి ఉంటుంది’ అనే సామెత ముత్తంగి, ఘన్‌పూర్ బెల్ట్‌లో నిజం కాబోతోంది. రూ.2,400 కోట్లతో ప్యాకేజీ-2 పనులు మొదలవ్వగానే ఆ ఏరియా అంతా ఇన్వెస్ట్‌మెంట్లకు అడ్డాగా మారనుంది. IT కారిడార్‌కు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతాల్లో నీటి భద్రత లభించడంతో భూముల ధరలకు రెక్కలు రావడం ఖాయం. మల్లన్న సాగర్ నుంచి వచ్చే గోదావరి జలాలు వెస్ట్ HYDను మరో స్థాయికి తీసుకెళ్లే ‘ఎకనామిక్ బూస్టర్’.

News January 20, 2026

కూకట్‌పల్లి: భర్తను చంపిన భార్య

image

కూకట్‌పల్లిలోని ఓ కాలనీలో అనుమానాస్పద మృతిగా నమోదైన కేసు హత్యగా తేలింది. సుధీర్ రెడ్డి (44)ని భార్య ప్రసన్న చున్నీతో ఉరేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మృతుడి సోదరి సునీత ఇచ్చిన ఫిర్యాదుతో ఈ హత్య ఉదాంతం బయటకొచ్చింది. నిందితురాలిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

News January 20, 2026

హైదరాబాద్‌కు అండర్ గ్రౌండ్ రివర్

image

HYD దాహాన్ని తీర్చడానికి ప్రభుత్వం రూ.7,360 కోట్లతో ‘అండర్ గ్రౌండ్ రివర్’ను సృష్టిస్తోంది. ఇప్పటిదాకా మనం విన్నది కేవలం పైప్‌లైన్‌ల గురించి మాత్రమే. కానీ ఈ ప్రాజెక్టు అసలు ఉద్దేశం సిటీకి 50 ఏళ్ల వాటర్ గ్యారెంటీ ఇవ్వడం. 50 TMC మల్లన్నసాగర్‌ను ఒక భారీ ‘పవర్ బ్యాంక్’లా వాడుకుంటూ అందులోని 20 TMCలను సిటీకి మళ్లించబోతున్నారు. వాతావరణం ఎలా ఉన్నా నగరం చుట్టూ ఉన్న రిజర్వాయర్లు ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటాయి.