News September 12, 2025

కూకట్‌పల్లి: పుట్టగొడుగుల్లా హాస్టల్స్.. చర్యలు తీసుకోండి

image

కూకట్‌పల్లిలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న హాస్టలను నియంత్రించాలని MLA కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ZC అపూర్వ చౌహాన్‌కు లేఖ రాశారు. ఉద్యోగ ఉపాధి, చదువుకోవడానికి వస్తున్న వారికి హాస్టల్స్ ఉపయోగకరంగా ఉన్న నివాసితుల మధ్య మాత్రం ఇబ్బందిగా ఉందని అన్నారు. అధిక డబ్బుల కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టి హాస్టళ్లకు లీజుకి ఇస్తున్నారని వాటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News December 17, 2025

సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు (2/2)

image

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు నడిచే ప్రత్యేక రైళ్లు ఇవే..
➣జనవరి 10, 12, 16, 18 తేదీల్లో సికింద్రాబాద్ ➝ శ్రీకాకుళం రోడ్డు (07290)
➣11, 13, 17, 19 తేదీల్లో శ్రీకాకుళం రోడ్డు ➝ సికింద్రాబాద్ (07291)
➣13న వికారాబాద్ ➝ శ్రీకాకుళం రోడ్డు (07294)
➣14న శ్రీకాకుళం రోడ్డు ➝ సికింద్రాబాద్ (07295)
➣17న సికింద్రాబాద్ ➝ శ్రీకాకుళం రోడ్డు (07292)
➣18న శ్రీకాకుళం రోడ్డు ➝ సికింద్రాబాద్ (07293)

News December 17, 2025

కరీంనగర్: తుది దశకు పల్లె పోరు.. బరిలో 1580 మంది

image

పల్లె సమరం తుది దశకు చేరుకుంది. 1580 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కరీంనగర్ జిల్లాలో 111 GPలకు 3 ఏకగ్రీవం కాగా 108 స్థానాలకు 451 మంది పోటీ పడుతున్నారు. SRCL జిల్లాలో 87 GPలకు 7 ఏకగ్రీవం కాగా 80 స్థానాలకు 379 మంది, జగిత్యాల జిల్లాలో 119 GPలలో 6 ఏకగ్రీవం కాగా 113 స్థానాలకు 456 మంది బరిలో నిలిచారు. PDPL జిల్లాలో 91 GPలలో 6 ఏకగ్రీవం కాగా 85 స్థానాలకు 294 మంది రేసులో ఉన్నారు.

News December 17, 2025

ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో శిక్షణ

image

ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో కమ్యూనిటీ హెల్త్‌వర్కర్, కంప్యూటర్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని ప్రాంగణ అధికారి వేల్పుల విజేత తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు, అర్హత కలిగిన ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు కోర్సును బట్టి 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ లోపు ప్రాంగణంలో దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.