News November 5, 2025

కూతురితో కలిసి హుస్సేన్‌సాగర్‌లో దూకి సూసైడ్

image

హుస్సేన్‌సాగర్‌లో దూకి తల్లీబిడ్డ తనువు చలించారు. లేక్ పోలీసుల వివరాలు.. CA కీర్తిక అగర్వాల్(28), ఆమె పాప కనిపించడం లేదని బహదూర్‌పురా PSలో మిస్సింగ్ కేసు నమోదైంది. NOV 2న హుస్సేన్‌సాగర్‌లో ఓ యువతి మృతదేహం లభ్యం అవగా విచారించిన పోలీసులు చనిపోయింది కీర్తిక అని గుర్తించారు. భర్తతో విభేదాల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. పాప మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 17, 2026

సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు హౌస్ అరెస్ట్

image

లష్కర్ ప్రాంతంలో నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలు దెబ్బతినకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

News January 17, 2026

HYDలో పలు చోట్ల ఫేక్ టాబ్లెట్స్.. జాగ్రత్త..!

image

HYDలో DGCA రిపోర్టు ప్రకారంగా.. తప్పుడు ఔషధ కంపెనీల పేర్లతో పలు మెడికల్ షాపుల్లో తప్పుడు లేబుల్స్ ఔషధాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. అంతర్రాష్ట్ర నకిలీ మందుల ముఠాలు దీని వెనుక ఉన్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది.

News January 17, 2026

సికింద్రాబాద్: ‘ర్యాలీకి పోలీసుల అనుమతి లేదు’

image

సికింద్రాబాద్ సాధన సమితి నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. హైదరాబాద్ నార్త్ జోన్ జాయింట్ సీపీ ఈ మేరకు స్పష్టం చేశారు. భద్రతా కారణాలు, ట్రాఫిక్‌ ఇబ్బందుల నేపథ్యంలో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం రాజకీయ, ప్రజావర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.