News October 6, 2025
కృష్ణాజిల్లా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలు

కృష్ణాజిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్ 14, 17 బాల బాలికల వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ ఎంపికలు ఈనెల 7న ఉదయం 9 గంటలకు నున్న ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమవుతాయి. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, పాఠశాల HM సంతకం, సీల్‌తో ఉన్న ఎంట్రీ ఫారం తీసుకురావాలని SGF కార్యదర్శులు దుర్గారావు, రాంబాబు తెలిపారు.
Similar News
News January 21, 2026
కృష్ణా: ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు ఏఓలుగా పదోన్నతి

కృష్ణా జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా (ఏఓ) పదోన్నతి లభించింది. వీరికి సంబంధించిన నియామక ఉత్తర్వులను జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పల హారిక బుధవారం పంపిణీ చేశారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.
News January 20, 2026
కృష్ణా: ‘ఇంటర్ పరీక్షలకు పకడ్బండీ ఏర్పాట్లు’

జిల్లాలో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలను ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన ఛాంబర్‌లో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మూడు దశల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రాక్టికల్ పరీక్షల కోసం 84 పరీక్షా కేంద్రాలు, వృత్తి విద్య ప్రాక్టికల్ పరీక్షల కోసం 18 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
News January 20, 2026
కృష్ణా జిల్లా కలెక్టర్‌కి అవార్డు

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బెస్ట్ ఎలక్ట్రోలర్ ప్రాక్టిసెస్ అవార్డును దక్కించుకున్నారు. ఈ నెల 25వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జరగనున్న నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ ఈ అవార్డును అందుకోనున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు అత్యధిక మంది కొత్త ఓటర్ల నమోదులో కలెక్టర్ చూపిన ప్రతిభకు గాను ఈ అవార్డు లభించింది.


