News August 22, 2025
కృష్ణా: కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన

జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఎస్పీ ఆర్.గంగాధరరావు నేతృత్వంలో సర్టిఫికెట్స్ పరిశీలన జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ.. అభ్యర్థుల విద్యార్హతలు, క్రీడా సర్టిఫికేట్లు, కేటగిరీకి సంబంధించిన ధ్రువపత్రాలు సహా అన్ని అవసరమైన పత్రాలను సక్రమంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 22, 2026
EVM గోడౌన్ భద్రతలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్‌ను ఆయన తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతా చర్యలు విషయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
News January 22, 2026
కృష్ణా: 23న జిల్లాలో ‘నా ఇండియా నా ఓటు’

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 23వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో ‘నా ఇండియా నా ఓటు’ అనే నినాదంతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన సూచించారు.
News January 22, 2026
కృష్ణా జిల్లా పరిషత్ బడ్జెట్ వివరాలే ఇవే.!

జిల్లా పరిషత్‌కు సంబంధించి 2025-26 సవరణ బడ్జెట్, 2026-27 అంచనాల బడ్జెట్‌ను ఆమోదించారు. 2025-26 సవరణ బడ్జెట్ అంచనా ప్రారంభ నిల్వ రూ.143.97కోట్లు కాగా ఆదాయం అంచనా రూ.817.82కోట్లకు గాను ఖర్చు అంచనా రూ.841.44కోట్లు, ముగింపు నిల్వ అంచనా రూ.120.34కోట్లుగా చూపారు. 2026-27 బడ్జెట్ అంచనా ప్రారంభ నిల్వ రూ.120.34కోట్లు కాగా ఆదాయం అంచనా రూ.2123.99కోట్లు కాగా ముగింపు నిల్వ అంచనా రూ.136.47కోట్లుగా చూపించారు.


