News May 7, 2025
కృష్ణా జిల్లాలో మత్స్యకారులకు రూ.26.15 కోట్ల భృతి

సముద్రంలో వేట నిషేధ కాలానికి సంబంధించి మత్స్యకారుల జీవనోపాధికై రూ.20వేలు చొప్పున భృతిని శనివారం అందజేయనున్నారు. జిల్లాలో 2,263 మెకనైజ్డ్, మోటరైజ్డ్, నాన్ మోటరైజ్డ్ బోట్లు ఉండగా 13,077 మంది మత్స్యకారులను అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.20వేలు చొప్పున రూ.26.15కోట్లు మంజూరైనట్టు మత్స్య శాఖ జేడీ తెలిపారు. ఈ మొత్తాన్ని మధ్యాహ్నం 12గంటలకు కలెక్టరేట్ కలెక్టర్ డీకే బాలాజీ చేతుల మీదుగా అందజేయనున్నారు.
Similar News
News February 16, 2026
కృష్ణా: రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ సమీక్ష

కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన మచిలీపట్నం కలెక్టరేట్‌లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. మచిలీపట్నం-విజయవాడ NHపై వేగ నియంత్రణల కోసం ఏర్పాటు చేసిన డ్రమ్ములు రాత్రి పూట కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ తక్షణమే డ్రమ్ములకు రేడియం స్టిక్కర్లు వేయాలని ఆదేశించారు.
News February 16, 2026
PGRSలో వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: DRO

PGRSలో వచ్చే ప్రతి అర్జీకి పరిష్కార మార్గం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్టణం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News February 16, 2026
బిల్ గేట్స్‌కు కలంకారీ వస్త్రాలను బహుకరించిన కలెక్టర్

రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్‌కు గన్నవరం విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. కలెక్టర్ డీకే బాలాజీ బిల్ గేట్స్‌కు పెడన కలంకారీ వస్త్రాలను బహుకరించి స్వాగతం పలికారు. సహజమైన రంగులతో ముద్రించిన కలంకారీ వస్త్రాల విశిష్టత, దాని వెనుక దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని కలెక్టర్ ఆయనకు వివరించారు.


