News November 30, 2025
కృష్ణా జిల్లాలో 1.1మి.మీలు వర్షపాతం నమోదు

దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 1.1 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం ఆదివారం ఉదయం 8.30ని.ల నుంచి రాత్రి 8గంటల వరకు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా నాగాయలంకలో 2.6 మి.మీలు, కోడూరులో 2.2మి.మీలు, అవనిగడ్డ, మోపిదేవిలలో 2.0మి.మీలు, చల్లపల్లి, కంకిపాడులలో 1.8మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైంది.
Similar News
News February 13, 2026
కృష్ణా: అప్పుడు ఓడిన నేతకు ఇప్పుడు ఛాన్స్ ఇస్తారా.?

2020లో జరిగిన రాజ్యసభ సభ్యుల ఎన్నికలలో టీడీపీ నుంచి సీనియర్ నేత వర్ల రామయ్య పోటీలో నిలిచారు. అప్పుడు టీడీపీకి శాసనసభ్యుల సంఖ్యాబలం లేకపోవడంతో ఆయనకు నిరాశే దక్కింది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతుండటంతో కూటమి నుంచి పెద్దల సభకు ఎవరిని పంపుతారోననే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ సారి వర్లకు టీడీపీ అధిష్ఠానం ఛాన్స్ ఇస్తోందేమో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.
News February 13, 2026
కృష్ణా: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త సూసైడ్

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. కానూరు కుమ్మర్లబజార్‌కు చెందిన బండి క్రాంతికుమార్ 7 నెలల కిందట చిన్నముత్తేవికి చెందిన అమలరాణిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో పుట్టింటికి వెళ్లే విషయమై ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. ఈ నెల 11న జరిగిన వాగ్వాదం అనంతరం ఆమె పుట్టింటికి వెళ్లగా, భర్త ఉరేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
News February 13, 2026
కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల కోసం లోకేశ్ ఆత్మీయ విందు

మంత్రి లోకేశ్ కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల కుటుంబాల కోసం నిర్వహించిన ఆత్మీయ విందు రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిందని మంత్రి కొల్లు కొనియాడారు. నిరంతరం ప్రజాసేవలో తలమునకలయ్యే నాయకుల కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం లోకేశ్‌కే సాధ్యమని ఆయన అన్నారు. ఈ విందు కార్యక్రమం కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచిందని, ఇలాంటి నాయకత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.


