News December 12, 2025
కృష్ణా: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST-2026) శనివారం జిల్లా వ్యాప్తంగా జరగనుంది. మొత్తం 17 కేంద్రాల్లో 1,894 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) యు.వి. సుబ్బారావు తెలిపారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ వెల్లడించారు.
Similar News
News January 19, 2026
కృష్ణా: SP పేరుతో ఫేక్ ఎకౌంట్లు.. సీరియస్ అయిన పోలీసులు

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఐడీలు క్రియేట్ చేయడమే కాకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి డబ్బులు డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై జిల్లా పోలీస్ శాఖ సీరియస్ అయింది. ఎస్పీ పేరుతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయవద్దని, ఎవరైనా డబ్బులు కావాలని మెసేజ్ చేసినా స్పందించవద్దని కోరింది. ఇటువంటి ఫేక్ ఐడీలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని DSP సీహెచ్ రాజా తెలిపారు.
News January 19, 2026
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.