News August 13, 2025
కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది 24/7 అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశా ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆయన RDO, ఇరిగేషన్, రెవెన్యూ, VMC అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే 2,3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరిగే అవకాశముందన్నారు. ముందు జాగ్రత్తగా నదీ పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
Similar News
News March 13, 2026
NRPT: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యే పది పరీక్షలకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:30 గంటల నుంచి 1:30 గంటల వరకు పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కేంద్రాలకు దగ్గరలో సభలకు, సమావేశాలకు అనుమతి లేదని, జిరాక్స్ దుకాణాలు మూసివేయాలన్నారు.
News March 13, 2026
సాగు, తాగునీటిపై కలెక్టర్ ‘సమీక్ష’

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో జిల్లాలో సాగు, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మిర్యాలగూడ నుంచి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
News March 13, 2026
RR: ‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం.. 53,058 విద్యార్థులు

పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 255 సెంటర్లు 1,024 పాఠశాలల నుంచి 53,058 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. మాస్ కాపీకి పాల్పడకుండా సెట్టింగ్ స్క్వాయిడ్, ప్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.


