News December 2, 2025

కృష్ణా: పోస్టాఫీసులో భారీ మోసం

image

ఉంగుటూరు పోస్టాఫీసులో నకిలీ స్టాంపులు, పాస్‌బుక్స్‌తో రూ.2 కోట్లకు పైగా ఖాతాదారుల డిపాజిట్లు మాయమైన ఘటన బయటపడింది. పోస్టుమాస్టర్ దేవేంద్రరావు, పోస్టుమాన్ శేఖర్ కలిసి ఏడాదిగా FDలు, సేవింగ్స్ రికార్డుల్లో భారీ మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. సోమవారం ఓ మహిళ FD తీసుకోడానికి రాగా అసలు విషయం తెలిసింది. ఖాతాదారులు విచారణ కోరగా, అధికారలు పోస్టుమాస్టర్‌ను సస్పెండ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News February 18, 2026

మరోసారి అభిషేక్ డకౌట్

image

T20WC: భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశ పరిచారు. పసికూన నెదర్లాండ్స్‌పై పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. కాగా అభిషేక్ ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్ కావడం గమనార్హం.

News February 18, 2026

విశాఖ సాగర్ తీరంలో జెట్ ఫైటర్ల విన్యాసాలు (వీడియో)

image

అంతర్జాతీయ ప్లేట్ రివ్యూలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు విశాఖ సముద్రతీరంలో అద్భుత విన్యాసం చేశాయి. ఒకేసారి ఏడు జెట్ ఫైటర్లు సముద్రానికి దగ్గరగా వెళ్తూ పల్టీలు కొట్టడం, బాంబులు వదిలే విన్యాసాలు నిర్వహించారు. తీరానికి శత్రుదేశం నౌకలు ఏమైనా చేరుకుంటే వాటిని ఎలా పేల్చాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

News February 18, 2026

నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ సమీపంలో బైక్ యాక్సిడెంట్ జరిగి గణపతి అనే వ్యక్తి మరణించాడని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 9న సాయంత్రం బైక్‌పై బోధన్ నుంచి బాసర వెళ్తుండగా మార్గమధ్యలో ఫకీరాబాద్ సమీపంలో బైక్ స్కిడ్ అయి తీవ్రంగా గాయపడ్డారన్నారు. అనంతరం గణపతి నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారని చెప్పారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.