News September 13, 2025

కృష్ణా: బీఈడీ కోర్సు అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ కోర్సుకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే ఈ క్యాలెండర్‌లో ప్రతి సెమిస్టర్‌లో 90 పని దినాలు, ప్రణాళికాయుతంగా పరీక్షలు జరిగేలా క్యాలెండర్‌ రూపొందించామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/లో అకడమిక్ క్యాలెండర్ చూడవచ్చు.

Similar News

News December 16, 2025

హాట్ మెటల్ ఉత్పత్తిలో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ రికార్డ్

image

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం 6AM నుంచి సోమవారం 6AM వరకు బ్లాస్ట్‌ఫర్నేస్ 1, 2, 3 విభాగాల్లో 21,012 టన్నుల హాట్‌మెటల్ ఉత్పత్తి జరిగింది. ఒక రోజులో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఈ ఏడాది NOV 30న 20,440 టన్నుల ఉత్పత్తి జరిగింది. సంస్థ అభివృద్ధి పట్ల తమకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని ఉద్యోగ, కార్మిక వర్గాలు తెలిపాయి. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశాయి.

News December 16, 2025

నేటి నుంచి పండగ (ధనుర్మాసం ) నెల ప్రారంభం

image

నేటి నుంచి ధనుర్మాసం రావడంతో పండగ నెల ప్రారంభం అయినట్లు ప్రముఖ పండితులు లోకా అనంత వెంకట మురళీధర్ శాస్త్రి తెలిపారు. జనవరి 14న భోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ నిర్వహించనున్నట్లు చెప్పారు. మంచు తెరలు ముద్దాడుతున్న వేళ పల్లె గుండెల్లో సంక్రాంతి సవ్వడి మొదలైంది. పండుగ నెల ప్రారంభం కావడంతో ప్రతి ఇంటి ముందు రంగవల్లిలతో తీర్చిదిద్దునున్నారు. గుమగుమలాడే వివిధ రకాల పిండి వంటలు చేసే పనులు నిమగ్నం అవుతారు.

News December 16, 2025

పాడేరు: యువత మంచి మార్గంలో నడవాలి- SP

image

సమాజంలో మార్పు రావాలంటే యువత మంచి మార్గంలో నడవాలని SP అమిత్ బర్దార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో గంజాయి నిర్మూలనపై జరిగిన సమావేశంలో మాట్లాడారు. గంజాయి రవాణా నియంత్రణకు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, నిఘా పెట్టామన్నారు. గంజాయి సాగు, రవాణా చేస్తున్న వారిపైనా, వారి బంధువులపైనా నిఘా ఉంటుందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే స్మగ్లర్లకు ఆశ్రయం కల్పించడం నేరమని స్పష్టం చేశారు.