News May 14, 2024
కృష్ణా: బీఈడీ కోర్సు అకడమిక్ క్యాలెండర్ విడుదల

కృష్ణా వర్శిటీ పరిధిలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ కోర్సు అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. నిర్ణీత పని దినాలు ఉండేలా క్యాలెండర్ తయారు చేసినట్లు వర్శిటీ పేర్కొంది. 2024 జూలై, నవంబర్ నెలల్లో బీఈడీ విద్యార్థులకు మొదటి, రెండో సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయంది. క్యాలెండర్ పూర్తి వివరాలకు కృష్ణా వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News December 11, 2025
కృష్ణా జిల్లా కలెక్టర్, మంత్రికి సీఎం ఇచ్చిన ర్యాంకు ఎంతంటే..!

సీఎం చంద్రబాబు కలెక్టర్ల పనితీరుపై ర్యాంకులు ప్రకటించారు. గత 3 నెలలకు సంబంధించిన నివేదికలో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఫస్ట్ ర్యాంకు సాధించారు. కలెక్టర్ 1,482 ఫైళ్లు స్వీకరించగా, 1,469 ఫైళ్లను వేగంగా పరిష్కరించారు. సగటు స్పందన సమయం 14 గంటలు 42 నిమిషాలు. డిజిటల్ పాలనలో కృష్ణా జిల్లా ఆదర్శంగా నిలిచింది. అదే విధంగా సీఎం మంత్రుల ర్యాంకులను ప్రకటించగా మంత్రి కొల్లు రవీంద్ర 24వ స్థానంలో నిలిచారు.
News December 11, 2025
కృష్ణా జిల్లా కలెక్టర్‌కు మెుదటి ర్యాంక్

జిల్లాల కలెక్టర్ల పనితీరుపై రూపొందించిన ఈ-ఫైల్ డిస్‌పోజల్ రిపోర్ట్ (గత 3 నెలల)లో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే తొలి ర్యాంకు సాధించింది. కలెక్టర్ బాలాజీ సారథ్యంలో సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9, 2025 వరకు 1,482 ఫైళ్లు స్వీకరించగా, 1,469 ఫైళ్లను వేగంగా పరిష్కరించారు. సగటు స్పందన సమయం 14 గంటలు 42 నిమిషాలే.. డిజిటల్ పాలనలో కృష్ణా జిల్లా ఆదర్శంగా నిలిచింది.
News December 10, 2025
గన్నవరం: ఇసుక కుప్ప కాదండి.. రంగు మారిన ధాన్యం..!

పై ఫోటోలో మీకు కనిపిస్తున్నది ఇసుక కుప్ప అనుకుంటున్నారు కదూ. కానే కాదు.. అది రంగు మారిన ధాన్యం రాశి. గత మొంథా తుఫాను వరదలో నానిన వరి చేను నూర్చారు. గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఇలా రంగు మారిన ధాన్యం రాశులు చూడొచ్చు. రైతులు 75 కిలోల బస్తా రూ.1300 చొప్పున వ్యాపారికి బుధవారం విక్రయించారు. ఈ విధంగా బస్తాకు వెయ్యి రూపాయలు చొప్పున రైతులకు నష్టాలు మిగిల్చింది తుఫాను.


