News December 11, 2024

కృష్ణా: బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్(థియరీ) పరీక్షలను 2025 జనవరి 22 నుండి నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 2025 జనవరి 1లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.

Similar News

News January 24, 2025

విజయవాడలో విదేశీ సిగరెట్లు స్వాధీనం

image

రామవరపాడులో గుట్టు చప్పుడు కాకుండా నిలువచేస్తున్న విదేశీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్, గుంటూరు జీఎస్టీ అధికారుల వివరాల మేరకు.. రామవరపాడులో విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ సిగరెట్ బాక్స్‌పై ఎటువంటి నియమ నిబంధనలు లేవని చెప్పారు. వాటి విలువ సుమారు రూ.1.76కోట్లు ఉంటుందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా 2 వారాలు రిమాండ్ విధించారు. 

News January 24, 2025

కృష్ణా: బీపీఈడీ&డీపీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో బీపీఈడీ&డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 10, 11,12,13 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది. 

News January 24, 2025

కృష్ణా: హోంగార్డులకు స్టడీ మెటీరియల్ అందించిన ఎస్పీ 

image

కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు హోంగార్డులు ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ఎంపికలో భాగంగా ఫిజికల్ టెస్టులు పాసయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్పీ గంగాధర్ గురువారం వారిని మచిలీపట్నంలోని తన కార్యాలయంలో అభినందించారు. అనంతరం వారందరికీ మెయిన్స్ పరీక్షకు కావలసిన స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఆయన అందజేశారు.