News August 3, 2024
కృష్ణా: బీపీఈడీ/డీపీఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల
కృష్ణా వర్సిటీ పరిధిలోని కళాశాలలలో బీపీఈడీ/డీపీఈడీ విద్యార్థులకు నిర్వహించే సప్లిమెంటరీ (One time Opportunity) పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. Y13 నుంచి Y20తో ప్రారంభమయ్యే రిజిస్టర్డ్ నంబర్ కలిగిన విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు ఆగస్టు 5లోపు అపరాధ రుసుము లేకుండా ఒక్కో సబ్జెక్టుకు రూ.2,000 ఫీజు చెల్లించాలని వర్సిటీ సూచించింది. వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని కోరింది.
Similar News
News September 13, 2024
ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
బీమా క్లెయిమ్‌ల ఫెసిలిటేషన్ కేంద్రం సెలవు దినములో కూడా పనిచేస్తోందని కలెక్టర్ డా. జి. సృజన శుక్రవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల ఆస్తి నష్టాలకు సంబంధించి బీమా క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శని, అదివారం, కూడా పని చేస్తుందని చెప్పారు.
News September 13, 2024
పారదర్శకంగా బదిలీలు నిర్వహించాం: ఎస్పీ
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు కృష్ణా జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసుల బదిలీలు నిర్వహించామని ఎస్పీ ఆర్. గంగాధర్ తెలిపారు. శుక్రవారం 135 మంది మహిళా పోలీసుల బదిలీల ప్రక్రియను తన కార్యాలయంలో నిర్వహించామని ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా వారు కోరుకున్న చోటుకే బదిలీలు చేశామని ఆయన స్పష్టం చేశారు.
News September 13, 2024
కృష్ణా: NSG జాబితాలో ఉన్న రైల్వే స్టేషన్లివే
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రైల్వే స్టేషన్లలో ఆరు స్టేషన్లు NSG(నాన్ సబర్బన్ గ్రూపు) జాబితాలో చోటు దక్కించుకున్నాయి. రాయనపాడు, రామవరప్పాడు స్టేషన్లు NSG-5 కేటగిరిలో చోటు సంపాదించగా, కొండపల్లి, మధురానగర్, నిడమానూరు, గన్నవరం స్టేషన్లు NSG-6 ప్రపోజల్ కేటగిరీలో చోటు దక్కించుకున్నాయి. కాగా రూ.528 కోట్ల రెవిన్యూతో విజయవాడ స్టేషన్ NSG-1 గుర్తింపు దక్కించుకుంది.