News August 12, 2025
కృష్ణా: బుధ, గురువారాల్లో భారీ వర్షాలు?

బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో బుధ, గురువారాల్లో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ X వేదికగా ప్రకటించారు. జిల్లా వాసులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్లు, కరెంటు పోల్స్, శిథిలావస్థ భవనాల వద్ద ఉండొద్దని సూచించారు.
Similar News
News March 11, 2026
కరీంనగర్‌లో ‘ఈ-ఆఫీస్’ సేవలు ప్రారంభం

పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థలో ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ సేవలను ఆయన ప్రారంభించారు. ఇకపై అన్ని విభాగాల్లో ఫైళ్లను, ప్రజల ఫిర్యాదులను ఆన్‌లైన్ ద్వారానే వేగంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పారదర్శక పాలన కోసమే ఈ డిజిటల్ సంస్కరణలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
News March 11, 2026
సంగారెడ్డి: 12న మున్సిపల్ ప్రజాప్రతినిధులకు శిక్షణ

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు చెందిన నూతన ఛైర్మన్లు, కౌన్సిలర్లకు ఈనెల 12న శిక్షణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ చట్టం-2019పై ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. శిక్షణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
News March 11, 2026
2027 జనగణన.. ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

AP: 2027 జనగణనలో భాగంగా ఈ ఏడాది మే 1 నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ చేపడుతున్నట్లు CM CBNకు సెన్సెస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె.నివాస్ వివరించారు. జనాభా లెక్కల ప్రక్రియ 2 దశల్లో జరగనుండగా, తొలి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన చేపట్టనున్నట్టు తెలిపారు. మే 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. APR 16-30 స్వీయ గణనకు అవకాశం కల్పిస్తారు. రెండో దశలో 2027 FEB నుంచి జనాభా లెక్కింపు ఉంటుంది.


