News September 9, 2025

కృష్ణా: బ్యూటిఫుల్ మూన్

image

బాపులపాడు గన్నవరం ఉంగుటూరు మండలాలలో ఆకాశం తన అందాలతో మంగళవారం రాత్రి మాయ చేసింది. నింగిలో మెరిసిన నిండు చంద్రుడు ప్రజల చూపులను కట్టిపడేశాడు. వెండి వెలుగులు విరజిమ్ముతూ ప్రకృతి తన మహిమను ఆవిష్కరించింది. నగరాల్లోనూ, గ్రామాల్లోనూ ఆ వెన్నెల విందు చూసేందుకు ప్రజలు ఆసక్తిగా బయటకు వచ్చి చిత్రాల్లాంటి దృశ్యాలను కెమెరాలో బంధించారు. మరి మీ ప్రాంతంలో ఈరోజు చంద్రుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి.

Similar News

News December 16, 2025

ఈ నెల 21న పల్స్ పోలియో: కలెక్టర్

image

ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముద్రించిన పల్స్ పోలియో కార్యక్రమ గోడపత్రికలను సోమవారం ఆయన కలెక్టరేట్ లో నిర్వహించారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకై పోలియో చుక్కలు తప్పక వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

News December 15, 2025

ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలి: కలెక్టర్

image

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మిల్లర్లను కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణపై రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఈ సంవత్సరం 149 కంబైన్డ్ హార్వెస్టర్ల ద్వారా రైతులు కోతలు కోయడం వల్ల గోనె సంచులు, వాహనాల కొరత ఏర్పడిందని, మిల్లర్లు తమవంతుగా గోనె సంచులు, వాహనాలు సమకూర్చాలన్నారు.