News September 13, 2025
కృష్ణా: రూ.10 కోట్ల దందాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

పేద విద్యార్థులు SSC, ఇంటర్ పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓపెన్ స్కూలింగ్ విధానం అక్రమార్కులకు కాసులు పండించింది. గత మూడేళ్లుగా ఉమ్మడి కృష్ణాలోని కొందరు అధికారులతో కలిసి ఓ గ్యాంగ్ ఈ దందా కొనసాగిస్తూ రూ.10 కోట్లు దండుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రి లోకేశ్, ఉన్నతాధికారులకు తాజాగా ఫిర్యాదు వెళ్లగా.. ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతున్నారు.
Similar News
News December 7, 2025
చలికాలం.. వీళ్లు జాగ్రత్త!

చలికాలంలో గుండెజబ్బుల ముప్పు ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు తీవ్రత సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. నవంబర్-ఫిబ్రవరి మధ్య హార్ట్ ఎటాక్ ఘటనలు 15-20% అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించింది. గుండె జబ్బులు, BP, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయం ఉన్నవారు, ధూమపానం, మద్యపానం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News December 7, 2025
WGL: వామ్మో మేం ఓటేస్తే మా పని ఖతమే..!

పంచాయతీ ఎన్నికలు విధుల్లో పాల్గొనే ఉద్యోగులను కలవర పెడుతున్నాయి. డ్యూటీ చేసే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తారు. ఓట్ల లెక్కింపుల్లో ఆ ఉద్యోగి ఎవరికి ఓటు వేశారో స్పష్టంగా తెలిసే అవకాశం ఉండడంతో, ఎందుకొచ్చిన గొడవ అంటూ చాలా మంది పోస్టల్ బ్యాలెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గ్రామ పోరులో వార్డు ఓటర్లు వందల సంఖ్యల్లోనే ఉండడమే వారికి భయం పట్టుకుంది.
News December 7, 2025
బాపట్ల జిల్లాలో ఎంతమంది రౌడీషీటర్లు ఉన్నారంటే

జిల్లాలో మొత్తం 1,013 మంది రౌడీ షీటర్లు ఉన్నారని బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ శనివారం తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరచూ నేరాలకు పాల్పడే వారికి పీడీ చట్టం ప్రయోగించడం, అవసరమైతే జిల్లా బహిష్కరణ విధించడానికి కూడా బోమన్నారు. ఇప్పటికే 32 మందిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.


