News December 1, 2025
కృష్ణా: రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దిత్వా.!

దిత్వా తుఫాన్ రైతన్నలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి తడవకుండా కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. యంత్రాల సహాయంతో కోసిన ధాన్యం తేమ శాతం అధికంగా ఉండటంతో విక్రయదారులు తక్కువ రేటుకు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. వర్షం కురుస్తున్న కారణంగా ధాన్యం ఆరబెట్టుకుని అవకాశం లేదన్నారు.
Similar News
News February 13, 2026
15 చోట్ల హంగ్.. ఇండిపెండెట్లే కీలకం

TG: మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఏకంగా 15 చోట్ల హంగ్ ఏర్పడింది. జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారం, బోధన్, వేములవాడ, గద్వాల, అలియాబాద్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఛైర్‌పర్సన్ ఎన్నికకు ఇండిపెండెంట్ల ఓట్లు, అలాగే ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు కీలకం కానున్నాయి.
News February 13, 2026
BREAKING: యాదగిరిగుట్ట మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 12 వార్డులకు గాను 7 వార్డులు కాంగ్రెస్ సాధించింది. BRS 1 వార్డు, బీజేపీ 2 వార్డులు, ఇతరులు 1 వార్డు గెలిచారు. మిగతా వార్డులో కౌంటింగ్ జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
News February 13, 2026
విషాదం, శుభకార్యాల సమయాల్లో లోన్ రికవరీ వద్దు: RBI

రుణాలు తీసుకున్న వారి ఇళ్లలో విషాదం చోటుచేసుకున్నప్పుడు లేదా శుభ కార్యాలు జరిగే సమయాల్లో లోన్ రికవరీ చేయొద్దని RBI బ్యాంకులను ఆదేశించింది. ‘రుణ రికవరీ విధానం అన్ని బ్యాంకుల్లో ఒకేరీతిన ఉండాలి. నిర్దేశిత రూల్స్ ప్రకారం ఏజెంట్ల నియామకం చేపట్టాలి. రికవరీ కోసం వారు చేసే ఫోన్ కాల్స్‌ను రికార్డు చేయాలి’ అని పేర్కొంది. రుణగ్రహీతల డేటాను ఉద్యోగులు, ఏజెంట్లు దుర్వినియోగం చేయకుండా చూడాలని సూచించింది.


