News December 1, 2025
కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా మీదుగా అనకాపల్లి(AKP)-సికింద్రాబాద్(SC) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07041 SC-AKP రైలు డిసెంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం, నం.07042 AKP-SC రైలు డిసెంబర్ 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని చెప్పారు.
Similar News
News February 12, 2026
నర్సీపట్నంలో పెద్దల అండతోనే దోపిడీ: YCP ట్వీట్

నర్సీపట్నంలో రాజేశ్, శరత్‌ను CBI అధికారులు <<19113870>>అరెస్టు<<>> చేశారు. కౌన్సిలర్ చంద్రిక భర్త అయిన రాజేశ్ కూటమి పెద్దల అండతోనే వ్యాపారాలు చేస్తున్నట్లు YCP పేర్కొంది. విద్యాసంస్థల సొసైటీ నుంచి రూ.2 కోట్లు తన ఖాతాకు బదిలీ చేయించడమే గాకా IRS అధికారికి లంచం ఇచ్చే ప్రయత్నం చేశాడంది. ‘మీ కూటమిలో బ్యాంకు రుణాల ఎగవేతదారులే ఉన్నారనుకున్నాం.. ఇలాంటి ఘరానా మోసగాళ్లు కూడా ఉన్నారా’ అంటూ CMని ఉద్దేశించి ట్వీట్ చేసింది.
News February 12, 2026
రేపు యథావిధిగా రవాణా శాఖ సేవలు: డీటీఓ

ఖమ్మం జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో రేపు అన్ని రకాల సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయని డీటీఓ ధర్మపురి జగదీష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంతో పాటు సత్తుపల్లి, వైరాలోని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకోవచ్చని, వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీ తదితర సేవల కోసం కార్యాలయాలకు రావచ్చని పేర్కొన్నారు.
News February 12, 2026
RR: రేపే లెక్కింపు.. మధ్యాహ్నానికే ఫలితాలు!

మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. రేపు 64 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, ఇందుకోసం 254 మంది సిబ్బందిని నియమించారు. షాద్‌నగర్‌లో అత్యధికంగా 14, ఆమనగల్‌లో అత్యల్పంగా 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల లోపు ఫలితాలు వెల్లడించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికకు సంబంధించి ఇన్‌ఛార్జ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.


