News June 28, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో ఫార్మ్-డీ (ఐదో ఏడాది) కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 3, 5, 8 తేదీల్లో ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

Similar News

News December 12, 2024

కృష్ణా: ట్రాక్టర్‌తో బావమరిదిని ఢీకొట్టిన బావ

image

విజయవాడలోని యార్లగడ్డ శివ, తన బావ పోసిన సాంబశివరావుల మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఈనెల 10న శివ అతని బావమరిది రాజేశ్‌లు బైక్‌పై వెళుతుండగా శివ బావ సాంబశివరావు ట్రాక్టర్‌తో వెంబడించి ఢీకొట్టాడు. ఈ ఘటనలో శివ వంద అడుగులకుపైగా ఈడ్చుకు వెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా శివ ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. 

News December 12, 2024

మచిలీపట్నం: మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం

image

రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. మంత్రి రవీంద్ర సోదరుడు కొల్లు వెంకట రమణ (64) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుకు గురైన వెంకట రమణను హుటాహుటిన ఆంధ్ర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సోదరుడి మరణ వార్త తెలుసుకున్న మంత్రి రవీంద్ర విజయవాడ నుండి మచిలీపట్నం బయలుదేరారు. మరికాసేపట్లో మంత్రి మచిలీపట్నం రానున్నారు.

News December 11, 2024

మచిలీపట్నం: పేర్ని నాని సతీమణిపై నమోదైన సెక్షన్లు ఇవే..

image

మాజీ మంత్రి, వైసీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) సతీమణి జయసుధ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి మానస తేజపై బందరు తాలుకా PSలో కేసు నమోదైంది. జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు సివిల్ సప్లయిస్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు వీరి ఇరువురిపై 316 (3), 316 (5), 61 (2) రెడ్ విత్ 3 (5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.