News March 28, 2024

కృష్ణా: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాక్ నిర్వహణ మరమ్మతులు జరుగుతున్నందున మచిలీపట్నం- విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.17220 విశాఖపట్నం- మచిలీపట్నం ట్రైన్‌ను ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 29 వరకు, నెం.17219 మచిలీపట్నం- విశాఖపట్నం ట్రైన్‌ను ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దు చేస్తున్నామని రైల్వే శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

Similar News

News February 6, 2026

బందరు పోర్టుకు రూ.573.77 కోట్ల రహదారి ప్రాజెక్టు..!

image

బందరు పోర్టు అభివృద్ధికి ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం రూ.573.77 కోట్లతో భారీ రహదారి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. NH-65, NH-216 జంక్షన్‌లను నేరుగా పోర్టుతో అనుసంధానిస్తూ 6 లైన్ల ప్రధాన రహదారి, సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రాజెక్టులో 3 ఫ్లైఓవర్లు, ఒక భారీ రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు తెలిపారు.

News February 6, 2026

కృష్ణా: టిడిపి జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం నేడే

image

కృష్ణా జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిమ్మకూరు వేదికగా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లా టిడిపి అధ్యక్షుడిగా నియమితులైన వీరంకి గురుమూర్తి కార్యక్రమంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు, వివిధ హోదాల్లో నియమితులైన కార్యవర్గ సభ్యులు కూడా అదే సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

News February 6, 2026

కృష్ణా: గ్రేట్.. అంధత్వాన్ని జయించి గ్రూప్-2 కొట్టి!

image

చల్లపల్లి(M) శివరాందుర్గాపురానికి చెందిన అంధ యువకుడు నాగరాజు అసాధారణ పట్టుదలతో గ్రూప్-2 విజేతగా నిలిచారు. 2010లో జరిగిన ప్రమాదంలో చూపు కోల్పోయినా అధైర్యపడకుండా, ఒంగోలు అంధుల పాఠశాలలో విద్యనభ్యసించి MA పూర్తి చేశారు. గ్రూప్-2 ఫలితాల్లో HOD విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. గతంలో CM చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న ఆయన, భవిష్యత్తులో గెజిటెడ్ అధికారి కావడమే తన లక్ష్యమన్నారు.