News December 7, 2025

కృష్ణా: స్క్రబ్ టైఫస్‌తో వ్యక్తి మృతి

image

ఉయ్యూరు మండలం ముదునూరుకి చెందిన శివశంకర్‌ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరణించారు. ఈ నెల 2న శాంపిల్స్ తీసుకోగా, రిపోర్ట్ రాకముందే 4వ తేదీన ఆయన మృతి చెందారు. శనివారం వచ్చిన రిపోర్టుల్లో ఆయనకు పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో జిల్లా వైద్య బృందం సర్వే చేపట్టింది.

Similar News

News January 19, 2026

కృష్ణా: SP పేరుతో ఫేక్ ఎకౌంట్లు.. సీరియస్ అయిన పోలీసులు

image

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఐడీలు క్రియేట్ చేయడమే కాకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి డబ్బులు డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై జిల్లా పోలీస్ శాఖ సీరియస్ అయింది. ఎస్పీ పేరుతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయవద్దని, ఎవరైనా డబ్బులు కావాలని మెసేజ్ చేసినా స్పందించవద్దని కోరింది. ఇటువంటి ఫేక్ ఐడీలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని DSP సీహెచ్ రాజా తెలిపారు.

News January 19, 2026

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.