News November 6, 2025

కృష్ణా: హవే విస్తరణపై ఎమ్మెల్యేల ముఖ్య సూచనలివే.!

image

VJA-MTM జాతీయ రహదారి నం.65 రహదారి విస్తరణపై బుధవారం విజయవాడలో అధికారులు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. NH-65 రహదారిని NH-16తో మూడు ప్రాంతాలలో అనుసంధానం చేయాలని ఎమ్మెల్యేలు అధికారులను కోరారు. రహదారి సమీప గ్రామాల్లో అండర్ పాస్‌ల నిర్మాణం, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజి వ్యవస్థ అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేలు సూచించారు.

Similar News

News January 17, 2026

మోదీ అండతో మనం మరింత ముందుకెళ్లాలి: CM

image

దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయని CM చంద్రబాబు తెలిపారు. ‘ఏపీకి ఉన్న అన్ని రకాల వనరులు ఉపయోగించుకుంటున్నాం. ఇటీవల రూ.8.75 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతి ఇచ్చాం. గ్రీన్ హైడ్రోజన్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్ మిషన్, డేటా సెంటర్లు, రోబోటిక్స్ వస్తున్నాయి. నాలెడ్జ్ ఎకానమీలో ముందున్న వారే విజేతలు అవుతారు. PM మోదీ అండతో మనం మరింత ముందుకెళ్లాలి’ అని కాకినాడలో సూచించారు.

News January 17, 2026

NGKL: జిల్లాలోని 4 మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారు

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ మున్సిపల్ శాఖ అధికారులు శనివారం జారీ చేశారు. నాగర్‌కర్నూల్ బీసీ జనరల్, కొల్లాపూర్ బీసీ మహిళ, అచ్చంపేట బీసీ మహిళ, కల్వకుర్తి జనరల్ మహిళలకు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. నాలుగు ఛైర్మన్ పదవులకు గాను మూడు సీట్లు మహిళలకు కేటాయించడం జిల్లాలో చర్చగా మారింది.

News January 17, 2026

సంగారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారు!

image

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
జనరల్: ఆందోలు- జోగిపేట, నారాయణఖేడ్
జనరల్ మహిళ: సంగారెడ్డి, సదాశివపేట, ఇస్నాపూర్
బీసీ జనరల్: జిన్నారం, గుమ్మడిదల, జహీరాబాద్
ఎస్సీ జనరల్: కోహిర్
ఎస్సీ మహిళ: గడ్డపోతారం, ఇంద్రేశం
మున్సిపాలిటీలు రిజర్వ్ అయ్యాయి. దీంతో ఛైర్మన్ పీఠంపై ఆశావహులు ఆశలు పెంచుకున్నారు.