News November 8, 2025
‘కృష్ణ పక్షం’ అంటే ఏంటి?

క్యాలెండర్‌లో కొన్ని తిథుల ముందుండే కృష్ణ పక్షం అంటే ఏంటో తెలుసుకుందాం. కృష్ణ పక్షం అంటే.. ప్రతి నెలా పౌర్ణమి తర్వాత, అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలం. ఈ పక్షంలో చంద్రుడి వెన్నెల క్రమంగా తగ్గుతుంది. చంద్రుడు అలా క్షీణిస్తూ పోతాడు కాబట్టి దీన్ని క్షీణ చంద్ర పక్షమని, చీకటి పక్షమని కూడా అంటారు. చీకటి, నలుపును సూచించే ‘కృష్ణ’ను జోడించి కృష్ణ పక్షం అనే పేరొచ్చింది. బహుళ పక్షం అని కూడా వ్యవహరిస్తారు.
Similar News
News January 19, 2026
PPP విధానంలో ఆర్టీసీ బస్టాండ్ల అభివృద్ధి

AP: రాష్ట్రంలోని ప్రధాన RTC బస్టాండ్లను PPP విధానంలో ₹958 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆటోనగర్ (విజయవాడ), గుంటూరు, కర్నూలు, మద్దిలపాలెం (విశాఖ), చిత్తూరు బస్టాండ్ల విస్తరణ, ఆధునికీకరణ చేయనున్నారు. తిరుపతి బస్టాండ్ అభివృద్ధి పనులు కేంద్ర సహకారంతో ఇప్పటికే ప్రారంభం అయ్యాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ప్రైవేటు సంస్థలు ముందుకు రాగానే ఇతర బస్టాండ్ల పనులూ చేపడతారు.
News January 19, 2026
చిన్న గ్రామం.. 100 మంది డాక్టర్లు

ఒక చిన్న గ్రామం దేశానికి 100 మంది డాక్టర్లను అందించింది. బిహార్ పాట్నాకు 55KMల దూరంలోని అమ్హారా గ్రామం ‘విలేజ్ ఆఫ్ డాక్టర్స్’గా పేరుపొందింది. సమాజ సేవ కోసమే ఇక్కడ చాలామంది డాక్టర్ చదువుతున్నారు. ఈ గ్రామానికి చెందిన సీనియర్ డాక్టర్లు రెగ్యులర్‌గా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తారు. విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తారు. వారిని ఆదర్శంగా తీసుకుని గ్రామంలో మరింతమంది మెడిసిన్ చదవడానికి ఆసక్తి చూపుతున్నారు.
News January 19, 2026
5 రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘అనగనగా ఒక రాజు’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ ఘనత అందుకుందని ట్వీట్ చేసింది. కాగా నవీన్ కెరీర్‌లో ఇదే తొలి రూ.100 కోట్ల మార్క్ మూవీ కావడం విశేషం.


