News September 12, 2025
కృష్ణ-VKB రైల్వేలైన్ పనులు చేపట్టాలి- CM

కృష్ణ- వికారాబాద్ రైల్వే లైన్ పనులను త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్తగా నిర్మించే వికారాబాద్ – కృష్ణ రైల్వే ప్రాజెక్ట్ ద్వారా కొడంగల్, నారాయణపేట, మక్తల్, పరిగి ప్రాంతాల ప్రజలకు మేలు జరగనుంది.
Similar News
News December 8, 2025
వ్యక్తిత్వ హక్కులు కాపాడాలంటూ హైకోర్టుకు జూ.ఎన్టీఆర్

ఈ-కామర్స్, SMలో తన పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడాలని కోరుతూ జూ.ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం 2021 ఐటీ నిబంధనల ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని సదరు SM ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. డిసెంబర్ 22న సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామంటూ అదే రోజుకు తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా SMలో ట్రోలింగ్‌పై గతంలో నాగార్జున కూడా ఢిల్లీ HCని ఆశ్రయించారు.
News December 8, 2025
తిరుమల: ఇద్దరు నిందితులకు 4 రోజుల కస్టడీ

తిరుమల కల్తీ నెయ్యి కేసులో అరెస్టు అయిన ఇద్దరు నిందితులకు నెల్లూరు ఏసీబీ కోర్టు 4 రోజులు కస్టడీకి అనుమతించారు. ఏ16 అజయ్ కుమార్ సుగంధ్, ఏ29 సుబ్రహ్మణ్యంను ఈనెల 9 నుంచి 12 వ తేదీ వరకు సీబీఐ సిట్ కస్టడీలో విచారించేందుకు న్యాయమూర్తి అనుమతించారు. కాగా ఏ16 బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
News December 8, 2025
బాపట్ల జిల్లాలో దోపిడీ.. అరికట్టేదెవరు..?

‘రక్తమోడ్చి పండించిన పంట రాబంధులకే’ అన్న చందంగా ఉందని రైతులు వాపోతున్నారు. తాము కష్టపడి పండించిన పంటను అమ్ముకోడానికీ స్వేచ్ఛ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. RSKలకు ధాన్యాన్ని అమ్మడానికి తీసుకెళ్తే తేమ శాతం ఎక్కువగా ఉందని వెనక్కి పంపుతున్నారంటున్నారు. మిల్లర్లు అధిక తేమ శాతం చూపి, తరుగుతో కొనుగోలు చేసి దోపిడీకి తెరలేపారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


