News March 4, 2025
కెరమెరి: హెచ్ఎంపై దాడి.. వ్యక్తిపై కేసు

కెరమెరి మండలం హట్టి హై స్కూల్ హెచ్ఎం గన్నుపై సోమవారం ఓ వ్యక్తి దాడి చేసి గాయపరిచినట్లు SI విజయ్ తెలిపారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న హెచ్ఎంను మద్యం మత్తులో ఉన్న దినేశ్ ఆసుపత్రి అడ్రస్ అడిగాడు. ఆయన చెప్పకపోవడంతో దినేశ్ తన జేబులో ఉన్న బ్లేడుతో ఆయన గొంతుపై దాడి చేశాడు. హెచ్ఎం ఫిర్యాదు మేరకు దినేశ్ పై కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
Similar News
News March 22, 2025
కాగజ్‌నగర్: 3 ఇళ్లల్లో చోరీ.. నిందితుడు అరెస్ట్

3 ఇళ్లలో చోరీ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పట్టణంలోని బాలాజీ నగర్‌లో కొద్ది రోజుల క్రితం 3 ఇళ్లలో చోరీ జరిగింది. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా ప్రదీప్ అనే నిందితుడుని పట్టుకున్నామన్నారు. అతడి వద్ద 86.6 గ్రా. బంగారు ఆభరణాలు, కారు, సెల్ ఫోన్, రూ.12వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.
News March 22, 2025
VZM: జిల్లాలో పర్యటించిన హైకోర్టు న్యాయమూర్తి

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ చీమలపాటి రవి శనివారం జిల్లా పర్యటనకు నగరానికి చేరుకున్నారు. జిల్లా కోర్టులో జరిగిన న్యాయాధికారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్, జిల్లా SP వకుల్ జిందాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయికల్యాణ్ చక్రవర్తి కూడా ఉన్నారు.
News March 22, 2025
క్రికెట్ బెట్టింగులకు దూరంగా ఉండండి: బాపట్ల ఎస్పీ

యువత బెట్టింగులకు దూరంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈరోజు నుంచి ప్రారంభమవుతున్న ఐపీఎల్ మ్యాచ్లను ఆసరాగా తీసుకొని క్రికెట్ బెట్టింగులకు తెరలేపే అవకాశం ఉందని అన్నారు. యువత బెట్టింగుల వైపు వెళ్లకుండా చదువుపై దృష్టి సాధించాలని అన్నారు.