News March 9, 2025
కేంద్రమంత్రితో పరిశ్రమల భూమిపూజలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

పరిశ్రమలను ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో రూ. 3,225 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న 4 ప్లాంట్లకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి మంత్రి భూమిపూజ నిర్వహించారు. అమరరాజా గిగా ఫ్యాక్టరీ -1, ఆల్టిమిన్, లోహమ్ మెటీరియల్స్, ఎస్సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లకు భూమిపూజ జరిగింది.
Similar News
News February 18, 2026
కడప, అన్నమయ్య MLAలకు లోకేశ్ తేనేటివిందు

కడప, అన్నమయ్య జిల్లాల్లోని MLAలకు లోకేశ్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. అమరావతిలో ప్రతిరోజూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎమ్మెల్యేలకు విడివిడిగా ఆయన విందును ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి కడప, అన్నమయ్య జిల్లాల ఎమ్మెల్యేలకు విందు ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రి మండిపల్లితోపాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విందుకు రాగా వారిని లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు.
News February 18, 2026
యాదాద్రి: నేటి నుండి నిత్య ఆర్జిత సేవలు రద్దు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 28 వరకు నిత్య ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. నిత్య కళ్యాణం, సుదర్శన నరసింహ హోమం, బ్రహ్మోత్సవం, జోడు సేవలు వంటి భక్తులతో నిర్వహించే సేవలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు చెప్పారు. ఉత్సవాల అనంతరం సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
News February 18, 2026
మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకుంటే…

TG: పరిషత్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో చిక్కొచ్చి పడింది. మార్చి 15లోపు ఎలక్షన్స్ నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు మురిగిపోనున్నాయి. అంతకుముందు నిర్వహిద్దామంటే టెన్త్ ప్రీఫైనల్స్, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంతో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సర్కార్ తర్జనభర్జన పడుతోంది. ఈ నెల 23న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయానికి రానుంది.


