News April 1, 2025
కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయను కలిసిన కేంద్రమంత్రి సంజయ్

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు కేంద్రమంత్రి సంజయ్ వినతి పత్రం అందించారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో 8-సింథటిక్ ట్రాక్, ఫ్లడ్ లైట్లు, ఓపెన్ గ్యాలరీలో క్రీడాకారులు, ప్రేక్షకుల కోసం కెనోపీ, రక్షణ కవచం ఏర్పాటు చేయాలని కోరారు.
Similar News
News April 20, 2025
లక్ష్మణచాంద: వాగులో బాలుడి మృతదేహం లభ్యం

లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన మద్దెల రాంచరణ్ (14)అనే బాలుడి మృతదేహం స్థానిక వాగులో ఆదివారం లభ్యమైంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. రాంచరణ్ రోజూ లాగే శనివారం మధ్యాహ్నం దోస్తులతో కలిసి వాగులో స్నానం చేయటానికి వెళ్లాడు. ఎస్సారెస్పీ కెనాల్ ప్రవహిస్తున్న కారణంగా వాగులో నీటి ఉద్ధృతి పెరిగి రాంచరణ్ నీటిలో మునిగిపోయి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 20, 2025
విమానాన్ని ఢీకొట్టిన టెంపో వ్యాన్!

బెంగళూరు ఎయిర్‌పోర్టులో నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఓ టెంపో వ్యాన్ ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విమానం కింద వ్యాన్ ఇరుక్కున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఘటనపై ఇండిగో స్పందించింది. ‘బెంగళూరులో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు జరుగుతోంది. అది పూర్తైన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. టెంపో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
News April 20, 2025
ప్రైవేట్ స్కూల్లో ప్రవేశం పొందవచ్చు: అల్లూరి డీఈవో

అభాగ్యులు, అనాధ పిల్లలు ఇకపై నేరుగా మీకు దగ్గరలో గల ఏ ప్రైవేట్ పాఠశాలలో (cbse, స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న ) అయినా 1వ తరగతిలో ప్రవేశం పొందవచ్చని అల్లూరి DEO బ్రహ్మాజీరావు ఆదివారం తెలిపారు. ఈ మేరకు 25% కోటా కేటాయించాలని అన్ని ప్రైవేట్ స్కూల్స్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈనెల 28 నుంచి మే 15 తేదీలోగా https://cse.ap.gov.in ద్వారా online దరఖాస్తు చేసుకొని బడిలో చేరాలన్నారు.