News September 11, 2024
కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయాలి: కలెక్టర్
కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ది శాఖ అమలు చేస్తున్న పథకాలు జిల్లాలో సక్రమంగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. పనుల పురోగతిపై ఎంపీ శబరికి నివేదిక రూపంలో అందజేసి కేంద్రం ద్వారా పెండింగ్ నిధులు రాబట్టేందుకు సహకరించాలన్నారు.
Similar News
News October 11, 2024
నంద్యాలలో మద్యం షాపులకు దరఖాస్తుల వెల్లువ
నంద్యాల జిల్లాలో 105 మద్యం షాపులకు 1,627 మంది టెండర్ దాఖలు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. నంద్యాల పరిధిలో 24 షాపులకు 584 టెండర్లు దాఖలయ్యాయని చెప్పారు. ఆళ్లగడ్డ 19 షాపులకు 262, డోన్ 16 షాపులకు 251, ఆత్మకూరు 13 షాపులకు 164, నందికొట్కూరు 10 షాపులకు 164, బనగానపల్లె 12 షాపులకు 160, కోవెలకుంట 11 షాపులకు 110 టెండర్లు వచ్చాయన్నారు.
News October 11, 2024
ఈనెల 14న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: కలెక్టర్
నంద్యాల కలెక్టరేట్‌లో ఈనెల 14న నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. పల్లె పండుగ వారోత్సవాలతో పాటు మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ ఉండటంతో రద్దు చేసినట్లు చెప్పారు. ప్రజలు గమనించాలని కోరారు. జిల్లా ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు.
News October 10, 2024
ఆదోని: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆదోని మండలం సాదాపురం క్రాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని అంజి(48) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కొంతకాలంగా పెట్రోల్ బంక్‌లో జీవనం సాగిస్తున్నాడు. వేకువజామున టీ తాగడానికి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కోమాలోకి వెళ్లాడు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బంధువులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలిస్తుండగా మృతి చెందాడు.