News January 10, 2026

కేంద్ర బడ్జెట్‌పైనే ఆశలు.. న్యాయం జరిగేనా?

image

AP: కేంద్ర <<18812112>>బడ్జెట్‌లో<<>> రాష్ట్రానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం కోరింది. విభజన హామీలు, అమరావతికి ఆర్థిక సాయం, పోలవరానికి, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రతిపాదించింది. పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు, కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై విజ్ఞప్తి చేసింది. అదనంగా రుణపరిమితి, ప్రత్యేక గ్రాంట్ల వెసులుబాటు కల్పించాలంటోంది. కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.

Similar News

News January 13, 2026

మిగిలిన భోగి పళ్లను ఏం చేయాలి?

image

భోగి పళ్లు పోసిన తర్వాత కింద పడిన పళ్లను పిల్లలు ఏరుకుంటారు. ఆ తర్వాత మిగిలిపోయిన పళ్లను బయట పడేయకూడదు. వాటిని శుభ్రం గోమాతలకు పెట్టడం వల్ల శుభం కలుగుతుంది. ఇతర మూగజీవాలకు ఆహారంగా వేయడం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే పళ్లు వృధా కాకుండా ఉండటమే కాకుండా, పశువులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా దక్కుతుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న మన సంప్రదాయాల్లో జీవ కారుణ్యం కూడా భాగమని చెప్పడానికి ఇదో నిదర్శనం.

News January 13, 2026

షాక్స్‌గామ్ వ్యాలీపై కన్నేసిన చైనా

image

జమ్ము కశ్మీర్‌లోని షాక్స్‌గామ్‌ వ్యాలీ ప్రాంతాన్ని తమ భూభాగం అంటూ చైనా మరోసారి ప్రకటించుకుంది. ఇప్పటికే ఆ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. చైనా చర్యను పలుమార్లు భారత్ ఖండించింది. అయితే షాక్స్‌గామ్‌ ప్రాంతం తమ భూభాగమేనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ మీడియా సమావేశంలో తెలిపారు. కాగా 1963లో పాక్ అక్రమంగా 5,180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు కట్టబెట్టింది.

News January 13, 2026

‘భోగి’ ఎంత శుభ దినమో తెలుసా?

image

భోగి నాడు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. గోదాదేవి శ్రీరంగనాథుడిలో లీనమై పరమ ‘భోగాన్ని’ పొందిన రోజు ఇదే. వామనుడి వరంతో బలిచక్రవర్తి భూలోకానికి వచ్చే సమయమిది. ఆయనకు స్వాగతం పలికేందుకే భోగి మంటలు వేస్తారు. అలాగే ఇంద్రుడి గర్వం అణిచి శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తిన పవిత్ర దినమిది. పరమశివుని వాహనమైన బసవన్న శాపవశాన రైతుల కోసం భూమికి దిగి వచ్చిన రోజూ ఇదే. ఇలా భక్తి, ప్రకృతి, పురాణాల కలయికే ఈ భోగి పండుగ.