News June 1, 2024

కేకే.. చిత్తూరు జిల్లాలో టీడీపీకి 10 సీట్లు!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కేకే సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలకు గాను కూటమి 10, వైసీపీ 3, ఒకచోట జనసేన గెలవనుందని కేకే సర్వే పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సర్వేపై మీ కామెంట్ తెలపండి.

Similar News

News September 8, 2024

చిత్తూరు: జపాన్‌లో ఉద్యోగావకాశాలు

image

జపాన్ దేశంలో నర్సులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్ రెడ్డి కోరారు. బెంగళూరులో జపాన్ భాషపై శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. జీతం రూ.1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 99888 53335లో సంప్రదించాలని కోరారు.

News September 8, 2024

తిరుపతి మహిళా వర్సిటీ ఫలితాల విడుదల

image

తిరుపతి శ్రీపద్మావతి మహిళ యూనివర్సిటీలో జూన్‌లో బీటెక్(B.Tech) మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫలితాలను www.spmvv.ac.in ద్వారా తెలుసుకోవచ్చు.

News September 7, 2024

వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న చిత్తూరు ఎస్పీ

image

చిత్తూరు జిల్లా కేంద్రంలోని పోలీసు క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వినాయకుడి విగ్రహానికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎస్పీ మణికంఠ పోలీసు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, సకల విజయాలు అందించాలని కోరుకున్నట్టు చెప్పారు. సిబ్బందికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ భాస్కర్ పాల్గొన్నారు.