News September 10, 2025
కేజీహెచ్‌లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స విజయవంతం

విశాఖ కేజీహెచ్‌లో అధునాతన క్యాన్సర్ చికిత్సలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఏర్పాటు చేసిన సీటీ సిమ్యులేటర్, లీనియర్ యాక్సిలరేటర్, బ్రాకీథెరపీ యంత్రాలపై తొలి చికిత్స విజయవంతమైంది. ఎలక్టా వెర్సా హెచ్‌డీ యంత్రంతో గొంతు క్యాన్సర్ రోగికి ఆర్క్ థెరపీ అందించారు. తక్కువ దుష్ప్రభావాలతో ఖచ్చితమైన ఫలితాలు అందించే ఈ టెక్నాలజీతో రోగులకు ప్రపంచస్థాయి వైద్యం అందించే స్థాయికి చేరుకుంది.
Similar News
News December 13, 2025
రెండు రోజుల్లో బుల్లెట్ నేర్చుకున్న బామ్మ

వయసులో ఉన్న అమ్మాయిలే బుల్లెట్ బండి నడపాలంటే అమ్మో అంటారు. కానీ చెన్నైకి చెందిన 60 ఏళ్ల లతా శ్రీనివాసన్ రెండు రోజుల్లో బుల్లెట్ బండి నడిపి ఔరా అనిపించారు. రిటైర్మెంట్ తర్వాత తనకిష్టమైన బైక్ రైడింగ్ నేర్చుకోవాలనుకున్న లత ఒక అకాడమీలో చేరారు. అక్కడ మొదటి రోజు క్లచ్.. గేర్ మార్చడం నేర్చుకుంది. రెండో రోజునే సెకండ్.. థర్డ్ గేర్‌లో స్మూత్‌గా బైక్ నడపడం మొదలుపెట్టి ట్రెండ్ సెట్టర్‌గా మారారు.
News December 13, 2025
వరంగల్: సీనియర్ క్రికెట్ జట్టు ఎంపిక

కాకా వెంకట స్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ టోర్నమెంట్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ క్రికెట్ జట్టు ఎంపికలు ఈ నెల 15, 16వ తేదీల్లో జరగనున్నాయి. వంగాలపల్లిలోని WDCA క్రికెట్ గ్రౌండ్‌లో ఎంపికలు నిర్వహిస్తారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆధార్ కార్డు, సొంత క్రికెట్ కిట్, యూనిఫాంతో హాజరు కావాలని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
News December 13, 2025
నెలలో జరీబు భూముల సమస్యల పరిష్కారం: పెమ్మసాని

AP: అమరావతిలో జరీబు భూముల సమస్యల పరిష్కారానికి నెల సమయం కోరామని కేంద్ర మంత్రి P.చంద్రశేఖర్ తెలిపారు. సాయిల్ టెస్ట్ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘రాజధాని గ్రామాల్లో శ్మశానాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలను త్వరలోనే కల్పిస్తాం. ల్యాండ్ పూలింగ్‌లో ఇప్పటికీ 2,400 ఎకరాలను కొందరు రైతులు ఇవ్వలేదు. వారితో మరోసారి చర్చిస్తాం. భూసమీకరణ కుదరకపోతే భూసేకరణ చేస్తాం’ అని పేర్కొన్నారు.


