News August 15, 2024
కేజీహెచ్‌లో నిలిచిపోయిన అత్యవసర సేవలు..!
జూనియర్ డాక్టర్ల ఆందోళనల నేపథ్యంలో కేజీహెచ్‌లో అత్యవసర సేవలో నిలిచిపోయినట్లు తెలిసింది. పీజీ మరియు ఇంటర్నల్ ద్వారా జరిగే వైద్య సేవలు కూడా నిలిచిపోయినట్లు సమాచారం. ఇదే కొనసాగితే ఆసుపత్రిలో రోగులు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిపై ఉన్నతాధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అయితే కలకత్తాలో డాక్టర్ హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News September 12, 2024
అన్ని ఆసుపత్రులకు అనుమతి తప్పనిసరి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
జిల్లాలోని అన్ని ఆసుపత్రులకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, నర్సింగ్ హోమ్‌లు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 12, 2024
ఈస్ట్ కోస్ట్ రైల్వే సరకు రవాణాలో బెంచ్ మార్క్
ఈస్ట్ కోస్ట్ రైల్వే సరకు రవాణాలో కొత్త బెంచ్ మార్కులు నమోదు చేసుకుంది. 160 రోజుల్లో 100 మిలియన్ టన్నుల సరకును అన్‌లోడ్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సరకు రవాణాలో 6.5% వృద్ధి నమోదు చేసుకున్నట్లు తెలిపారు. కొత్త రోడ్ డివిజన్లో 60.38 మిలియన్ టన్నులు, సంబల్పూర్ డివిజన్లో 17.382లో సరకు రవాణా చేసినట్లు వివరించారు.
News September 12, 2024
విశాఖ: తిరుపతి శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు
తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. వచ్చేనెల 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక రైలు తిరుపతిలో సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.47కు శ్రీకాకుళం చేరుకుంటుందన్నారు. శ్రీకాకుళం రోడ్డు నుంచి తిరుపతికి అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపారు.