News October 4, 2025
కేజీహెచ్‌లో విద్యార్థినిలకు ప్రత్యేక చికిత్స

పచ్చకామెర్లతో బాధపడుతున్న 85మంది కురుపాం విద్యార్థినిల్లో 22మందికి KGHలో ప్రత్యేక వైద్యం అందజేస్తున్నట్లు సూపరింటెండెంట్ వాణి తెలిపారు. 63మంది పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని జేసీ ఆర్.వైశాలి శనివారం రాత్రి పరామర్శించి ధైర్యం చెప్పారు. విద్యార్థినిల మృతిపై <<17915804>>సీఎం ఆరా<<>> తీయగా.. ప్రిన్సిపల్ సెక్రటరీ గౌతమి పాఠశాలను సందర్శించారు. కాగా కురుపాం ప్రాంతంలో నీటి నమూనాలు సేకరించారు.
Similar News
News January 24, 2026
Grok సేవలకు అంతరాయం

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ Grok సేవలకు అంతరాయం ఏర్పడింది. గ్రోక్ యాప్, ట్విటర్‌లోలోనూ అందుబాటులో లేదు. ‘హై డిమాండ్ కారణంగా గ్రోక్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. వాటిని సరిచేసేందుకు మేము కృషి చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా మీకు సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని xAI సంస్థ తెలిపింది.
News January 24, 2026
అరుణోదయ స్నానం ఆచరిస్తూ పఠించాల్సిన మంత్రం ఇదే..

“యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి’’
తెలిసీ, తెలియక చేసిన పాపాలు, తప్పుల వల్ల వచ్చిన రోగాలు, శోకాలన్నీ ఈ సప్తమి స్నానంతో నశించుగాక! అని దీనర్ధం.
News January 24, 2026
గుంటూరు జిల్లాలో 45 పోస్టులకు నోటిఫికేషన్

AP: గుంటూరు జిల్లా వైద్యారోగ్యశాఖ 45 <


