News February 17, 2025

కేయుూ: 21 నుంచి LLB మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

image

కేయూ పరిధిలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు(రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) ఈ నెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఆసిమ్‌ ఇక్బాల్‌ తెలిపారు. ఈ నెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మ.2 నుంచి సా. 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు.

Similar News

News April 13, 2026

NRML: ఇంటర్ ఫలితాలు.. వినీషకు 469/470 మార్కులు

image

పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని మామడ మండలం కొరటికల్‌కు చెందిన వినీష నిరూపించింది. ముత్తన్న-లక్ష్మి దంపతుల కుమార్తె అయిన వినీష ఎంపీసీలో 469/470 మార్కులు సాధించి సత్తా చాటింది. ప్రభుత్వ పాఠశాల నేపథ్యం నుంచి వచ్చి రాష్ట్రస్థాయి మార్కులు సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. చిన్నపాటి పొలమే ఆధారమైనా ఉన్నత చదువులు చదివిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News April 13, 2026

సెన్సస్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్, జైలు శిక్ష

image

AP: సెన్సస్-2027లో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అవకాశం ఉంటుంది. మే 1 నుంచి క్షేత్రస్థాయి గణన ప్రారంభం కానుంది. అధికారులు జనాభా లెక్కల కోసం వచ్చినప్పుడు ఇళ్ల యజమానులు అనుమతించాలని ప్రభుత్వం సూచించింది. ‘వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే రూల్ అధికారులకూ వర్తిస్తుంది’ అని పేర్కొంది.

News April 13, 2026

HYD: GREAT.. 11ఏళ్లుగా FREE కోచింగ్

image

ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు మల్కాజిగిరి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కొట్టే ఏడుకొండలు అండగా నిలుస్తున్నారు. 11 ఏళ్లుగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తూ సేవ చేస్తున్నారు. 2015లో 32 మందితో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పటికి 10 లక్షల మందికి విస్తరించింది. తన జీతంలో సుమారు 40 శాతం ఖర్చు చేస్తూ 13 సబ్జెక్టులు బోధిస్తున్నారు.